డిజిటల్ అసిస్టెంట్‌పై దాడి
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన డిజిటల్ అసిస్టెంట్ బోనెల మహేష్‌బాబుపై అదే గ్రామానికి చెందిన శెట్టి అప్పలనాయుడు దాడికి పాల్పడినట్టు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో విధుల్లో ఉన్న సమయంలో ఓబీసీ సర్టిఫికెట్ కోసం అప్పలనాయుడు సచివాలయానికి వెళ్లాడు. కొంత సమయం పడుతుందని డిజిటల్ అసిస్టెంట్ సమాధానం ఇవ్వడంతో ఒకింత అసహనానికి గురైన అప్పలనాయుడు డిజిటల్ అసిస్టెంట్‌ను చేతితో కొట్టి దుర్భాషలాడాడని, విధులకు ఆటంకం కలిగించినట్టు ఎస్సై తెలిపారు. ఈ విషయంపై మహేష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.


