మాయిశ్చరైజర్‌.. మిషన్ల కొనుగోలులో మతలబు | - | Sakshi
Sakshi News home page

మాయిశ్చరైజర్‌.. మిషన్ల కొనుగోలులో మతలబు

Nov 29 2025 7:47 AM | Updated on Nov 29 2025 7:57 AM

మాయిశ్చరైజర్‌.. మిషన్ల కొనుగోలులో మతలబు

పాలకొండలో ఓ రైస్‌ మిల్లుకు అధికారులు

అందజేసిన మాయిశ్చరైజర్‌ మిషన్‌

మిల్లరుకు ఇచ్చిన మాయిశ్చరైజర్‌ మిషన్‌ బిల్లు

వీరఘట్టం/పాలకొండ: మాయిశ్చరైజర్‌ మిషన్లలో ధాన్యంలో తేమ శాతం లెక్కిస్తారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ మిషన్లతో ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో గుర్తిస్తారు. తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉంటే ఆ ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్‌ఎస్‌కేలు తేమ శాతం పరిశీలించిన తర్వాత వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర పట్టించేందుకు సమీపంలో ఉన్న మిల్లుకు ట్యాగ్‌ చేసి పంపిస్తారు. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని మర పట్టించిన తర్వాత సీఎంఆర్‌ రైస్‌ పేరిట మరలా ప్రభుత్వానికి మిల్లరు బియ్యాన్ని అందజేస్తారు. అయితే ఆర్‌ఎస్‌కే సిబ్బంది పరిశీలించి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు పంపించేటప్పుడు అక్కడ మిల్లరు ఎక్కడా ధాన్యం తేమ శాతం చూడాల్సిన పని లేదు. కానీ ప్రతీ మిల్లు వద్ద కచ్చితంగా మాయిశ్చరైజర్‌ మిషన్లు ఉండి తీరాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతీ మిల్లరుకు ప్రభుత్వం సూచించిన కంపెనీ నుంచి మాయిశ్చరైజర్‌ మిషన్లు కొనుగోలు చేసి ఇస్తామని హుకుం జారీ చేశారు. ప్రతీ మిల్లరు వద్ద రూ.30 వేలు వసూలు చేసి మాయిశ్చరైజర్‌ మిషన్లు అందజేశారు. అయితే ఈ మిషన్లు అంత ఖరీదు ఉండవని మిల్లర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

ఏం జరిగింది...

ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సీజన్‌ కావడంతో ఽ ప్రభుత్వం నుంచి ధాన్యం వస్తే మర పట్టించేందుకు ముందు ప్రతీ మిల్లరు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. బీజీలు ఇచ్చిన మిల్లులకు ప్రభుత్వం ఽరైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇస్తుంది. అందుచే ప్రతీ మిల్లు వద్ద మాయిశ్చరైజర్‌ మిషన్‌ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మిల్లరు తనకు నచ్చిన మాయిశ్చరైజర్‌ మిషన్‌ కొనుగోలు చేసుకోవడానికి వీలు లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన మిషన్‌ మాత్రమే తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అందుకుగాను రూ.25,100 మిషన్‌ ఖరీదు, 18 శాతం జీఎస్టీ కింద రూ.4512లు, సర్వీసు చార్జ్‌ కింద రూ.388లు కలుపుకుని మొత్తం రూ.30 వేలను మిల్లర్లు అందరి నుంచి పౌర సరఫరాల శాఖ అధికారులు వసూలు చేశారు. ఇలా జిల్లా మిల్లర్లు నుంచి తమ అనుయాయులకు మాయిశ్చరైజర్‌ మిషన్లు ద్వారా సుమారు రూ.26 లక్షలను కట్టబెట్టారని పౌర సరఫరాల శాఖ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కొందరి వద్ద పాత మాయిశ్చరైజర్‌ మిషన్లు ఉన్నప్పటికీ, కొత్తవి తీసుకోవాలని అధికారులు ఆదేశించడంతో మిల్లర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మిషన్లు కొనుగోలు చేశామంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయమిది

ప్రతీ మిల్లు వద్ద ఒకే కంపెనీకి చెందిన ఒకే రకమైన మాయిశ్చరైజరు మిషన్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మాకు వచ్చిన మిషన్లు మిల్లర్లకు అందజేశాం. ఇందులో ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు లేవు. మిషన్లు అన్నీ పారదర్శకంగా కొనుగోలు చేశాం. ఇందులో మిల్లర్లు అపోహలు చెందవద్దు.

– కె.శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ డిపో మేనేజర్‌, పార్వతీపురం మన్యం

నోరు మెదపలేకపోతున్న మిల్లరు...

తమ వద్ద రూ.30 వేలు తీసుకుని ఇచ్చిన మాయిశ్చరైజర్‌ మిషన్లు అంత ఖరీదు ఉండవని మిల్లర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ధాన్యం సీజన్‌ కావడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పినట్టు వినకపోతే ఇబ్బందులు వస్తాయనే భయంతో వారు అడిగినంతా ఇచ్చేసి వారు ఇచ్చిన మాయిశ్చరైజరు మిషన్లు తీసుకున్నామని మిల్లర్లు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement