గంగా పుష్కరాలకు ప్రత్యేక బస్సు | - | Sakshi
Sakshi News home page

గంగా పుష్కరాలకు ప్రత్యేక బస్సు

May 1 2023 5:34 AM | Updated on May 1 2023 5:34 AM

భాస్కరరావుకు నగదు అందజేస్తున్న టైలర్‌ మధు  - Sakshi

భాస్కరరావుకు నగదు అందజేస్తున్న టైలర్‌ మధు

శ్రీకాకుళం అర్బన్‌: కాశీలో గంగా పుష్కరాలకు ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం–1 డిపో నుంచి బయలుదేరింది. ఈ బస్సును శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్‌ కె.మాధవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 3వ వరకు పుష్కరాలు జరుగుతాయన్నారు. సూపర్‌లగ్జరీ బస్సులో 36 మంది యాత్రికులు బయలుదేరి వెళ్లారని తెలిపారు. మే 2న కాశీలో బయలుదేరి 3వ తేదీ సాయంత్రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ వి.రమేష్‌, గ్యారేజ్‌ ఇన్‌చార్జి రాజు, ఎంపీ రావు, రాజు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిత్యాలయ పాలక మండలి తొలి సమావేశం నేడు

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలక మండలి (ధర్మకర్త) సభ్యుల తొలి సమావేశం సోమవారం ఉదయం 10 గంటల నుంచి ట్రస్ట్‌ బోర్డు మీటింగ్‌ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 12 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నియమించిందని, తొలి సమావేశానికి ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ ఇప్పిలి జోగి సన్యాసిరావు అధ్యక్షత వహిస్తారని ప్రకటించారు. గౌరవ పాలకమండలి సభ్యులంతా హాజరుకావాలని, కేవలం సభ్యులకు మాత్రమే సమావేశంలో అనుమతి ఉంటుందని ఈవో స్పష్టం చేశారు.

మంత్రిని కలిసిన

యూహెచ్‌సీ చైర్మన్లు

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం పరిధిలోని ఆరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు నూతనంగా నియమితులైన చైర్మన్లు ఆదివారం పెదపాడులో మంత్రి ధర్మాన ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి సన్మానం చేశారు. కార్యక్రమంలో మొదలవలస రాజేంద్రకుమార్‌, డి.రమేష్‌ రాజు, డి.పి.దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

టైలర్‌ నిజాయితీ

పాతపట్నం: పాతపట్నం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం వద్ద రూ.2.50 లక్షల నగదు చాకిపల్లి గ్రామానికి టైలర్‌ కనకాల మధుకు ఆదివారం దొరికింది. వెంటనే ఆ నగదును పోలీస్టేషన్‌కు వెళ్లి అప్పగించి నిజాయితీ చాటుకోవడంతో పలువురు అభినందించారు. పాతపట్నం కొత్త దేవాంగుల వీధి దిగువ ఉంటున్న బర్ల భాస్కరరావు ఆదివారం ఏటీఎంలో లక్ష రూపాయలు డిపాజిట్‌ చేసి మిగిలిన రూ.2.50 నగదు మరిచిపోయారు. భాస్కరరావు నగదు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో టైలర్‌ మధు నగదు తీసుకురావడంతో ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు సమక్షంలో ఆ మొత్తాన్ని భాస్కరరావుకు అందజేశారు. టైలర్‌ మధు నిజాయితీని మెచ్చుకుని భాస్కరరావు రూ.10 వేలు నగదు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో పోలీసులు జీవరత్నం, రైటర్‌ శంకర్‌ ఉన్నారు.

రబీ వరి దిగుబడి బాగు

నరసన్నపేట: ఖరీఫ్‌తో పోల్చితే రబీలో వరి దిగుబడి బాగా పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 32 నుంచి 36 బస్తాల వరకూ దిగుబడి వచ్చిందని అంటున్నారు. నరసన్న పేట మండలంలో ఎక్కువగా రైతులు ఆర్‌ఎన్‌ఆర్‌ వరి రకాన్ని వేశారు. సుగర్‌ లెస్‌ ధాన్యం కావడంతో బహిరంగ మార్కెట్‌లో ధర కూడా ఆశాజనకంగా ఉంది. కంబకాయ, కరగాం, నారాయణవలస, అంప్లాం, ఉర్లాం, మాకివలస, గొట్టిపల్లి, బుచ్చిపేట, నర్శింగపల్లితో పాటు పలు గ్రామాల్లో రబీ వరి వేశారు. ప్రస్తుతం కోత దశలో పంట ఉంది. పలు గ్రామాల్లో యంత్రాల సహకారంతో కోతలు చురుగ్గా నిర్వహిస్తున్నారు.

బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న డీఎం మాధవ్‌ 1
1/3

బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న డీఎం మాధవ్‌

ఉర్లాం వద్ద కోసిన వరి పంట నుంచి వచ్చిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో వేస్తున్న కోత మిషన్‌  2
2/3

ఉర్లాం వద్ద కోసిన వరి పంట నుంచి వచ్చిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో వేస్తున్న కోత మిషన్‌

మంత్రి ధర్మాన ప్రసాదరావుతో 
అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల చైర్మన్లు 3
3/3

మంత్రి ధర్మాన ప్రసాదరావుతో అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల చైర్మన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement