
కానిస్టేబుల్ మానోజ్‌కుమార్ ముదిలి
మల్కన్‌గిరి: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసు సిబ్బందే.. గంజాయి వ్యాపారికి సహకరిస్తూ పట్టుబడ్డాడు. మల్కన్‌గిరి జిల్లాలోని మర్కపల్లి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మల్కపల్లి గ్రామానికి చెందిన శరత్‌చంద్ర ఛలాన్ అనే వ్యక్తి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అతనిని అరెస్ట్ చేసిన మల్కన్‌గిరి పోలీసులు.. విచారణ చేయగా కాఖీల సాయంతోనే వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. విషయాన్ని ప్రత్యేకంగా తీసుకున్న మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్ కీండో.. గంజాయి వ్యాపారికి సహకరిస్తున్న కానిస్టేబుల్ మనోజ్‌కుమార్ ముదిలిని స్వయంగా అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాను అరికట్టడంతో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.