
దండోరా వేయిస్తున్న నిర్వహుకులు దుర్గాప్రసాద్ దేశీబెహరా
బరంపురం: నగరంలోని మాబుడి శాంతమ్మ సంబరాలకు చురుగ్గా సాగుతున్నాయి. ఏప్రిల్ 4న అర్ధరాత్రి నుంచి పారంభం కానున్న ఈ ఉత్సవాలకు సంబంధించి స్థానిక దేశీ బెహరా వీధిలో బరంపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తాత్కలిక ఆలయం నిర్మాణం చేపట్టారు. మరోవైపు బరంపురం సబ్ కలెక్టర్ కార్యలయంలో నిర్వహుకులు దుర్గాప్రసాద్ దేశీబెహరా బృందంతో సబ్ కలెక్టర్ కులకర్ణి అసుతోష్‌తో సోమవారం సమావేశమయ్యారు. ఏర్పాట్లపై చర్చలు జరిపారు. దేశీబెహరా ఇంటి నుంచి ఘటాలు బయలు దేరి, తిరిగి గర్భగుడి, తాత్కాలిక ఆలయానికి చేర్చేందుకు రూట్ మ్యాప్‌ను ఎస్పీ సరవణ్ వివేక్ సిద్ధం చేసినట్లు తెలిపారు. అమ్మవారు గ్రామంలోకి వచ్చిన సమయంలో ప్రత్యేక పోలీసు భద్రత చేపట్టనున్నారు. అలాగే ఉత్సవాలకు సంబంధించి వీధుల్లో చాటింపు కార్యక్రమం సంప్రదాయంగా కొనసాగింది.