ముగిసిన బాడీబిల్డింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బాడీబిల్డింగ్‌ పోటీలు

Mar 21 2023 1:52 AM | Updated on Mar 21 2023 1:52 AM

మిస్టర్‌ ఆంధ్రా చాంపియన్‌ టైటిల్‌ను 
అందుకుంటున్న పడాల సంతోష్‌కుమార్‌  - Sakshi

మిస్టర్‌ ఆంధ్రా చాంపియన్‌ టైటిల్‌ను అందుకుంటున్న పడాల సంతోష్‌కుమార్‌

శ్రీకాకుళం న్యూకాలనీ:

శ్రీకాకుళం జిల్లా స్టార్‌ బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్‌ జూబ్లీ ఆడిటోరియం వేదికగా రెండు రోజులు జరిగిన 25వ మిస్టర్‌ ఆంధ్రా బాడీబిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి. చాంపియన్‌గా పార్వతీపురం పట్టణానికి చెందిన పడాల సంతోష్‌కుమార్‌ నిలిచాడు. బిలో 55 కేజీలు, 60, 65, 70, 75, 80, 85, 90 కేజీలు, మాస్టర్స్‌ బరువు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి అధికసంఖ్యలో క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు.

క్రీడాస్ఫూర్తి ముఖ్యం

ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. బాడీ బిల్డింగ్‌ చేయడంతో శారీరక ధారుడ్యంతో పాటు అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చన్నారు. శ్రీకాకుళంలో వరుసగా తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీ లు నిర్వహించి పదోసారి కూడా విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసిన విజయ్‌కుమార్‌ బృందాన్ని అభినందించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు సుంకరి కృష్ణకుమార్‌ మాట్లాడుతూ.. బాడీబిల్డింగ్‌ క్రీడ ఎంతో ఖర్చుతో కూడుకున్నదన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహించడం విజయ్‌కే సాధ్యమైందన్నారు. టీపీడీ నాయకుడు గొండు శంకర్‌ మాట్లాడారు. పోటీలు విజయవంతానికి సహకరించిన వారికి ఆంధ్రప్రదేశ్‌ బాడీబిల్డర్‌ అసోసియేషన్‌ అసోసియేట్‌ సెక్రటరీ వి.విజయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జిల్లాకు చెందిన ఇంటర్నేషనల్‌ బాడీబిల్డర్‌ అల్లిబిల్లి సత్యన్నారాయణ, నేషనల్‌ బాడీబిల్డర్‌ బి.సూరిబాబు, ఆంధ్రప్రదేశ్‌ బాడీబిల్డర్స్‌ అసోసియేషన్‌ అసోసియేట్‌ సెక్రటరీ వి.విజయ్‌, జిల్లా అధ్యక్షులు బలగ ప్రసాద్‌లను.. సుంకరి కృష్ణ, గొండు శంకర్‌, గోపాల్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ అధినేత పి.గోపాల్‌ దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అంధవరపు సూరిబాబు, మాదారపు వెంకటేష్‌, మాదార పు డేవిడ్‌, మండలి మనోజ్‌కుమార్‌, మజ్జి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మిస్టర్‌ ఆంధ్రా చాంపియన్‌గా సంతోష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement