
ఆనందాన్ని పంచుకుంటున్న విద్యార్థులు
● ఏప్రిల్ 3నుంచి మెట్రిక్ జవాబు పత్రాల మూల్యాంకన ● రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు
భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్ ఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన మెట్రిక్ పరీక్షలు సోమవారంతో పూర్తయ్యాయి. జవాబు పత్రాలు దిద్దడంతో టేబులేషన్ తదితర అనుబంధ ప్రక్రియ ముగించి ఫలితాలు సకాలంలో ప్రకటించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 3నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాట్లు చేసిన ట్లు బీఎస్‌ఈ అధ్యక్షుడు రమాశిష్ హజ్రా వెల్లడించా రు. ఏప్రిల్ వారంలోగా పరీక్ష ఫలితాలు ప్రకటించేందుకు నిర్ణయించామన్నారు. మెట్రిక్ పరీక్షలు ఈనెల 10నుంచి ప్రారంభమై సోమవారం జరిగిన గణితం పరీక్షతో ముగిశాయి. ఈ ఏడాది కొత్త పద్ధతిలో నిర్వహించిన పరీక్షలకు దాదాపు 5 లక్షల 50వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బోర్డు పరీక్షకు బదులుగా, ద్వితీయ సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్ష లు నిర్వహించారు. దీనికి ముందు పాఠశాలలో విద్యార్థులకు 20మార్కులకు ఇంటర్నల్ పరీక్ష జరిగింది. ఈ ఏడాది కూడా పరీక్షల సీజన్‌లో స్వల్ప వివాదాలు తెరకెక్కాయి. అచ్చు తప్పులు, ప్రశ్న పత్రాలు లీక్ వంటి ఘటనలు వెలుగులోకి వచ్చా యి. సాంఘికశాస్త్రం ప్రశ్న పత్రంలో తప్పులు దొర్లా యి. గణితం ప్రశ్న పరీక్ష సమయానికి ముందే ప్రసారమైనట్లు ప్రసారమైన వార్తలతో రాష్ట్ర శాసనసభలో తీవ్ర దుమారం రేగింది. ఈ ఏడాది పరీక్షల ఆరంభం నుంచి చాలామంది విద్యార్థులు హాజరు కాకపోవడం కలవరం రేపింది. ఈ పరిస్థితి సర్వత్రా ఆందోళన ప్రేరేపించింది
437మంది గైర్హాజరు..
రాయగడ: జిల్లాలో విద్యార్థుల సౌకర్యం కోసం 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 11,147 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 437మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పూర్ణచంద్ర భొరియా తెలిపారు. సోమవారంతో పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు. ఒకరికొకరు రంగులు జల్లుకుని, ఆనందాన్ని పంచుకున్నారు.
గజపతి జిల్లాలో ప్రశాంతంగా..
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గత 20రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం నాలుగు నోడల్ కేంద్రాల్లో ప్రశ్న పత్రాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆధీనంలో భద్రపరిచారు. పోలీసు బలగాల పర్యవేక్షణలో 35 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించగా.. 7312మందికి గాను 7067మంది విద్యార్థులు హాజరయ్యారని నోడల్ కేంద్రం సూపరింటెండెంట్ డి.శ్రీరామ్మూర్తి తెలిపారు. ఓపెన్ స్కూల్ నుంచి 10 పరీక్షలకు 104మంది దరఖాస్తు చేసుకోగా, 95 మంది పరీక్ష రాశారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఎం.సత్యనారాయణ, పర్యవేక్షకుడిగా సాత్మిక్ పట్నాయక్ వ్యవహరించారు.

పర్లాకిమిడి: మహారాజా బాలుర ఉన్నత పాఠశాల కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు