
చికిత్సపొందుతున్న సింహాచలం
పార్వతీపురం: తాగి వచ్చినందుకు కొడుకు మందలించడంతో మనస్తాపం చెందిన కొమరాడ మండలం దుగ్గి గ్రామానికి చెందిన టి.సింహాచలం పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటనపై పార్వతీపురం అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహాచలం ఇంటికి తాగి రావడంతో కుమారుడు వినోద్ ఎందుకు రోజూ తాగివచ్చి న్యూసెన్స్ చేస్తున్నావని మందలించి పోతావా పోవా అంటూ కోపంగా అనడంతో మనస్తాపం చెందిన సింహాచలం ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి చనిపోతానంటూ తాగేశాడు. అది గమనించిన కుమారుడు పురుగు మందుడబ్బాను లాక్కుని తాగిన మందు బయటకు వచ్చేలా ప్రయత్నించాడు. అనంతరం ద్విచక్రవాహనంపై చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించాడు.