
సమావేశమైన మహేంద్రగరి పరిరక్షణ కమిటీ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని చారిత్రక మహేంద్రగిరి పర్వతాల పరిరక్షణ, అక్కడి మౌలిక సౌకర్యాలపై స్థానిక పెద్ద రాధాకాంత మఠంలో సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. సమావేశంలో భాస్కరతీర్థ లక్ష్మీబాబా, మహేంద్రగిరి పరిరక్షణ సమితి సభ్యులు, ఉత్కళ హితేషిణీ సమాజ్ కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రొ, శ్రీకాంత్ పట్నాయక్(ఒడిశా పర్యావరణ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు), సీసీడీ అడ్డాల జగన్నాథరాజు, ఖొయిపూర్ సర్పంచ్, సమితి సభ్యులు హాజరయ్యారు. మహేంద్రగిరి పర్వతం కుంతీ, యుధిష్టర, భీమ మందిరాలకు విద్యుత్ సరఫరా, పంథ్ నివాస్‌కు తాగునీరు కోసం స్తంభాలు వేయాలని కోరుతూ ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. మహేంద్రగిరి పరిరక్షణ, విద్యుత్ ఇతర సౌకర్యాలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్ర మహాపాత్రొ కోరారు. దీనికి సభ్యులంతా ఆమోదించారు.