
జూనియర్ విభాగంలో చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
రాయగడ: ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను పురష్కరించుకుని ఆదివారం రంగోలి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జానియర్ విభాగంలో రితిక బెహరా ప్రథమ, ఇప్పిలి శిరీష ద్వితీయ, దేవ్‌రాజ్ తృతీయ, ఊన్న శ్రీయాన్ ప్రోత్సాహక బహుమతి గెలుచుకున్నారు. చిత్రలేఖనం సీనియర్ విభాగంలో బాలమిక జొడియా, వర్షారాణి దాస్ వరుస స్థానాల్లో నిలిచారు. లాడి బ్రాహ్మణి, జి.గీతలు తృతీయ బహుమతులు, పి.జ్యోత్న్స లకు ప్రోత్సాహక బహుమతి లభించింది. మహిళల పోటీల్లో ఇప్పిలి అర్జిత, ఎస్.ఇందుమతి, కె.అలేఖ్య ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి దక్కించుకున్నారు. జి.సుమాలిక ప్రోత్సాహక బహుమతి గెలుచుకున్నారు. మహిళల మధ్య జరిగిన రంగోలి పోటీల్లో పి.భాగ్యశ్రీ ప్రథమ, కె.తరణి ద్వితీయ, వి.హేమలత, ఇప్పిలి ఆశ తృతీయ, పట్నాన జయంతి బహుమతులు లభించాయి.
అకాల వర్షాలతో అంతరాయం
జయపురం: అకాల వర్షాలు కారణంగా ఉగాది ఉత్సవాలకు అంతరాయం ఏర్పడింది. తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహిస్తున్న పోటీలకు మైదానం మొత్తం జలమయం కావవంతో నిర్వాహకులు ఆలస్యంగా పోటీలను ప్రారంభించారు. సోమవారం మెహందీ, వంటల పోటీలు జరగనున్నాయి. ఈనెల 21, 22 తేదీల్లో రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు ఆధ్వర్యంలో చేపట్టానున్నారు.

పోటీల్లో బహుమతి పొందిన ముగ్గు

జయపురం: సిటీ స్కూలులో ముగ్గుల పోటీలు