ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనపై అత్యవసర ఆదేశాలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నేడు కన్నాట్ ప్లేస్ సమీపంలో సీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరసనపై తక్షణ ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ విచక్షణతో మెలగాలని ఆశిస్తున్నామని సీజేఐ అన్నారు. నిరసనలతో చిన్న దుకాణదారుల జీవనోపాధి దెబ్బ తినకూడదన్న సుప్రీం కోర్టు.. వ్యాపారం దెబ్బతింటే రాజ్యాంగ పరిధిలో చర్యలు తీసుకుంటామని జస్టిస్ బాగ్చి అన్నారు.
నిరసనలు, శాంతిభద్రతలు, ప్రజల జీవనోపాధి.. అన్నీ పరస్పరం సంబంధం ఉన్న అంశాలుగా పేర్కొన్న జస్టిస్ బాగ్చి.. నష్టంపై అవసరమైతే పరిహారం సహా తగిన న్యాయపరమైన చర్యలు పరిశీలిస్తామన్నారు. సెంట్రల్ పార్క్ను మూసివేస్తూ ఎన్డీఎంసీ నిర్ణయం తీసుకుందని కోర్టుకు న్యాయవాది తెలిపారు. అక్టోబర్ 26 లేదా 27కు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు


