బుల్లి‌ రెహమాన్‌‌ రెడీ అవుతున్నాడు | Kerala Boy Drumming Skills Shaking Internet | Sakshi
Sakshi News home page

బుల్లి ఏఆర్‌ రెహమాన్‌‌ రెడీ అవుతున్నాడు

Aug 18 2020 5:00 PM | Updated on Aug 18 2020 5:06 PM

Kerala Boy Drumming Skills Shaking Internet - Sakshi

వీడియో దృశ్యాలు

తిరువనంతపురం : ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు కేరళకు చెందిన ఓ బాలుడు. తన టాలెంట్‌తో ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. కేరళ మళప్పురానికి చెందిన ఆరేళ్ల బాలుడు అభిషేక్‌ కిచు రెండు కర్ర ముక్కలు, రాయితో అదిరిపోయేలా డ్రమ్స్‌ వాయిస్తున్నాడు. పాటకు అనుగుణంగా కర్రలను ఆడిస్తూ వ్వాహ్వా అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ( స‌ర్వ‌ నాశ‌నం చేసి ఎంజాయ్ చేస్తున్నారా?)

కావేరీ అనే ట్విటర్‌ యూజర్‌ ఈ వీడియోను తన ఖాతాలో సోమవారం విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పటివరకు లక్షకు పైగా వ్యూస్‌, 7 వేల లైకులు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘బుల్లి ఏఆర్‌ రెహమాన్‌‌ రెడీ అవుతున్నాడు.. ఆరేళ్లకే అదరగొడుతున్నాడు.. నీ టాలెంట్‌ అద్భుతం కుర్రోడా!..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement