ఘోర అగ్ని ప్రమాదం : తొమ్మిదిమంది ఆహుతి | Gujarat Fire: Textile Godown Collapses After Explosion in Ahmedabad | Sakshi
Sakshi News home page

ఘోర అగ్ని ప్రమాదం : తొమ్మిదిమంది ఆహుతి

Nov 4 2020 4:31 PM | Updated on Nov 4 2020 4:49 PM

Gujarat Fire: Textile Godown Collapses After Explosion in Ahmedabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వడోదర: గుజరాత్‌లోని ఒక బట్టల గౌడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌ నానుకాకా ఎస్టేట్‌లోని  పిప్లాజ్ రోడ్‌లోని టెక్స్‌టైల్ గోడౌన్‌లో బుధవారం ఒక్కసారిగా  భారీ మంటలు వ్యాపించాయి. ఈ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం ​కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ వ్యాపించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

మంటలు, పేలుడు కారణంగానే భవనం కూలిపోయిందని అగ్నిమాపక అధికారిజయేష్ ఖాడియా తెలిపారు.ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని శిథిలాల నుండి బయటకు తీసి ఎల్జీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement