నిర్మలాసీతారామన్‌పై స్టాలిన్‌ మండిపాటు | Cm Stalin Criticised Finance Minister Nirmala Sitaraman | Sakshi
Sakshi News home page

నిర్మలాసీతారామన్‌పై స్టాలిన్‌ మండిపాటు

Sep 14 2024 12:59 PM | Updated on Sep 14 2024 1:00 PM

Cm Stalin Criticised Finance Minister Nirmala Sitaraman

చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మండిపడ్డారు. ఆమెది అహంకారమని,ఆమె తీరు సరిగా లేదని విమర్శించారు. ఇటీవల కోయంబత్తూరులో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ఓ రెస్టారెంట్‌ చైన్‌  యజమాని శ్రీనివాసన్‌ నిర్మలాసీతారామన్‌ను ప్రశ్నించారు.

జీఎస్టీలోని లోపాలను ఎత్తి చూపేందుకు బన్‌, క్రీమ్‌, క్రీమ్‌ బన్‌లపై విధిస్తున్న జీఎస్టీ పన్నును సోదాహరణంగా వివరించారు.ఇది అక్కడ సమావేశంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. దీంతో అక్కడున్నవారంతా విరగబడి నవ్వారు. 

ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన ప్రైవేట్‌ భేటీలో శ్రీనివాసన్ నిర్మలకు క్షమాపణ చెబుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతో సహా దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు నిర్మలపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి..  ఆకాశవీధిలో రోజు 4.3లక్షల మంది 

Advertisement
 
Advertisement
Advertisement