Black Fungus: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచనలు

As Black Fungus Cases Rise Health Minister On Symptoms Do And Do Nots - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య వారిని కలవర పెడుతోంది. కోవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్ మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దేశంలో ఈ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ శుక్రవారం పలు సూచనలు చేశారు. ఈ ఫంగస్ కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతుండడంతో.. తొలినాళ్లలోనే గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను నిరోధించవచ్చని ఆయన తెలిపారు.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి హర్ఫ వర్ధన్‌ ట్విట్టర్‌లో పలు వివరాలను వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వారికే సోకుతోంది. ఇతర రోగకారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర వాధ్యులు, వొరికొనజోల్ ఔషధాలు వాడేవారు, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోయినవారు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారు దీని బారిన పడుతున్నారు. 

లక్షణాలు..
కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు. అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు వెల్లడించారు.

నివారణకు చేపట్టాల్సిన చర్యలు..

  • మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. కోవిడ్ సోకి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మధుమేహులు.. కోలుకున్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించువాలి.
  • స్టెరాయిడ్లను వైద్యుల సూచనతో పద్ధతి ప్రకారం వాడాలి. ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యుమిడీఫయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. చికిత్సలో నిర్ధారిత మోతాదు ప్రకారమే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలను వాడాలి.

చేయకూడనవి

  • లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యంగా ఉండడం.
  • కరోనా సోకి చికిత్స తీసుకునేటప్పుడు ముక్కులు మూసుకుపోతే బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ అనుకోవడం.
  •  బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉండడం.
  • రెమిడిసివిర్ అనవసరంగా వాడితేనే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

చదవండి: ‘బ్లాక్‌ ఫంగస్‌’: పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-05-2021
May 14, 2021, 21:26 IST
సాక్షి, హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ...
14-05-2021
May 14, 2021, 21:25 IST
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్‌ గార్డెన్‌ నివాసి అయిన శశాంక్‌‌ శేఖర్‌(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో...
14-05-2021
May 14, 2021, 18:52 IST
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల...
14-05-2021
May 14, 2021, 17:51 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,88,803...
14-05-2021
May 14, 2021, 16:13 IST
పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. మానసిక రుగ్మతలైన....
14-05-2021
May 14, 2021, 15:55 IST
న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన...
14-05-2021
May 14, 2021, 14:45 IST
కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్‌ చిదిమేసింది. కోవిడ్‌ కారణంగా...
14-05-2021
May 14, 2021, 14:40 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రెండో దశలో  రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో  ఊరటనిచ్చే సమాచారం స్పుత్నిక్-వీ టీకా స్వీకరణ షురూ కావడం. రెండు...
14-05-2021
May 14, 2021, 14:39 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేనప్పుడు టీకా తీసుకోవాలని ప్రజలను కోరడం ఏంటని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది....
14-05-2021
May 14, 2021, 14:07 IST
డెహ్రాడూన్: భారత్‌లో కరోనా రెండో దశ విరుచుకుపడుతోంది. మహమ్మారి కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య...
14-05-2021
May 14, 2021, 13:48 IST
న్యూఢిల్లీ : చిన్నారిని కాపాడేందుకు వాళ్ల కుటుంబం సాయశక్తులా ప్రయత్నించారు. కానీ మాయదారి కరోనా 5నెలల చిన్నారిని కబలించింది. ఆరు రోజులుగా...
14-05-2021
May 14, 2021, 13:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దేశంలో అందుబాటులోకి రానున్న రష్యా స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ధర రూ.995.40గా ఉండనుంది. రష్యానుంచి దిగుమతి చేసుకునే...
14-05-2021
May 14, 2021, 12:12 IST
ఢిల్లీకి చెందిన ఓ 30 సంవత్సరాల యువతి కరోనా కారణంగా తన ప్రాణాలను కోల్పోయింది.
14-05-2021
May 14, 2021, 08:18 IST
భారత జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోసును గురువారం తీసుకున్నాడు.
14-05-2021
May 14, 2021, 05:27 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వచ్చి మూడురోజులు దాటినా తగ్గలేదంటే జాగ్రత్త పడాల్సిందే. ఐదురోజులు దాటితే ప్రమాదానికి దారితీసే...
14-05-2021
May 14, 2021, 05:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరులకు అందజేస్తున్న కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర...
14-05-2021
May 14, 2021, 05:01 IST
న్యూఢిల్లీ: కోవాగ్జిన్‌ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ అంగీకరించింది. నీతి ఆయోగ్‌...
14-05-2021
May 14, 2021, 04:49 IST
ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా... మరోవైపు జపాన్‌ ప్రజలు నిరసనలు చేస్తున్నా... టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలు ఆగిపోవని అంతర్జాతీయ ఒలింపిక్‌...
14-05-2021
May 14, 2021, 04:28 IST
హిమాయత్‌నగర్‌: ‘సార్‌.. మా నాన్న చనిపోయేలా ఉన్నాడు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి. వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్‌ చేయాలని సిస్టర్‌ చెప్పారు....
14-05-2021
May 14, 2021, 04:17 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్‌–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్‌ బారిన పడడం,...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top