
అందరి సహకారంతోనే..
ఉపాధ్యాయుల బోధన, ప్రత్యేక తరగతులు, తక్కువ సమయంలో క్లిష్టమైన సబ్జెక్టులలో రాణించేలా ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఎంతో సహాయపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు బోధన అందరి సహకారంతో నేను 555 మార్కులు సాధించగలిగాను.
– చంద్రకళ (555), కేజీబీవీ, నర్వ
అర్థమయ్యేలా బోధించారు
కొన్ని అంశాలు ఎంత చదివినా అర్థమయ్యేది కాదు. ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులు చిత్రాలు చూపుతూ.. వివరంగా సులభంగా అర్థమయ్యేలా బోధించారు. ఎమ్మెల్యే అందించిన పదో తరగతి స్టడీ మెటీరియల్ మాకు ఎంతో సహాయకారిణిగా మారింది. వార్షిక పరీక్షలంటే గతంలో కొంత భయం ఉండేది. ఉపాధ్యాయుల సూచన, ప్రతిరోజు పాఠశాలలో నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలతో భయం పోయింది.
– కె.అమృత (555), పాథర్చేడ్ ఉన్నత పాఠశాల
●
ఉన్నత స్థాయికి చేరాలనే..
సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందాలన్నదే మా తపన. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని స్టడీ మెటీరియల్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాం. నిపుణులు, ఉపాధ్యాయుల ఆలోచనతో దీనిని తయారు చేయించి ఉచితంగా ఇచ్చాం. అలాగే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో విద్యార్థుల చదువు కోసం మరింత కృషి చేస్తాం. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్

అందరి సహకారంతోనే..

అందరి సహకారంతోనే..