‘డబుల్‌’ పరేషాన్‌..! | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ పరేషాన్‌..!

Published Mon, Apr 15 2024 1:50 AM

- - Sakshi

నీలగిరి మున్సిపాలిటీలో కొన్ని బహుళ అంతస్తుల భవనాలకు రెండేసి నంబర్లు

భారీగానే డబుల్‌ నంబర్లు..

నీలగిరి పట్టణంలోని 48 వార్డుల్లో 40 వేలకు పైగా నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయి. నీలగిరి పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌, పానగల్‌ రోడ్‌, డీవీకే రోడ్‌లో, బీటీఎస్‌, రామగిరి తదితర ప్రాంతాల్లో ఎక్కవగా డబుల్‌ నంబర్లు ఉన్న భవనాలు ఉన్నట్లు మున్సిపల్‌ సిబ్బంది చెబుతున్నారు. డబుల్‌ నంబర్లు ఉన్న యజమానులు ఒక అంతస్తుకు ఆస్తి పన్ను చెల్లిస్తూ.. మరో అంతస్తుకు చెల్లించకపోవడంతో మున్సిపాలిటీలో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. సంబంధిత భవనాలకు ఒక దానికి ఉన్న నెంబర్‌కు, బై నెంబర్‌ అని ఒక సంఖ్య పెంచి వేసి ఉంటున్నాయి. అదే అడ్రస్‌, వారివే పేర్లు ఉంటున్నా తమవి కావు అని గట్టిగా చెబుతుండడంతో మున్సిపల్‌ సిబ్బంది ఏమీ అనలేని పరిస్థితి ఉంది. డబుల్‌ నంబర్లపై ఆస్తి పన్ను వసూలు విషయంలో మున్సిపల్‌ సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. డబుల్‌ ఇంటి నంబర్ల కారణంగా మున్సిపాలిటీ ప్రతి సంవత్సరం రూ.50 లక్షల వరకు ఆదాయం కోల్పోతుందనే చర్చ జరుగుతోంది.

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపాలిటీలోని బహుళ అంతస్తుల భవనాలకు రెండేసి నంబర్లు తీసుకున్న యజమానులు వాటికి ఆస్తి పన్ను చెల్లింపుల విషయంలో కిరికిరి పెడుతున్నారు. నాలుగైదు అంతస్తుల భవనాలు నిర్మించుకున్న వారు.. అప్పటి అవసరాల రిత్యా కొందరు ఒకటి కన్నా ఎక్కువ నంబర్లు తీసుకున్నారు. మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించాలని సదరు భవనాల వద్దకు సిబ్బంది వెళ్లినప్పుడు పన్ను చెల్లించకుండా మొండి కేసి సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నట్లు మున్సిపల్‌ సిబ్బంది వాపోతున్నారు. తాము తీసుకుంది ఒకటే నంబర్‌ అని, మిగతా నంబర్‌ తమది కాదంటూ ఆస్తి పన్ను చెల్లించకుండా ఎగమానం పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నంబర్లు ఇచ్చినప్పుడు ఉన్న ఉద్యోగి ఆ తరువాత బదిలీపై వెళ్తుండడం, ఇతర ప్రాంతాల నుంచి కొత్త వారు వస్తుండడంతో.. వారు సంబంధిత యాజమానులను గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. ఇలాంటి వాటిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే వీటిపై ఓ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక చొరవ తీసుకుంటేనే..

నీలగిరి పట్టణంలో నెలకొన్న ఈ డబుల్‌ నంబర్లు సమస్యపై రాష్ట్ర స్థాయిలో మున్సిపల్‌ ఉన్నతాధికారులు కూడా సమీక్షించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప ఈ సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యే సూచనలు కనిపించడంలేదు. పట్టణంలో మొత్తం రీ అసిస్‌మెంట్‌ చేస్తే తప్ప ఈ సమస్య తీరే అవకాశం లేదు.

నల్లగొండ పట్టణ వ్యూ

ఫ పన్ను చెల్లింపు విషయంలో యజమానుల కిరికిరి

ఫ మాది ఒకటే నంబర్‌ అంటూ దాటవేత

ఫ మున్సిపల్‌ సిబ్బందికి తప్పని అవస్థలు

ఇంటింటికీ వెళ్లి విచారిస్తాం

ఆస్తి పన్ను చెల్లించని భవనాల వద్దకు వెళ్లి విచారణ చేస్తాం. ఇంటి నంబర్‌ ఉన్న చోట ఇల్లు ఉందా లేదా, లేక డబుల్‌ నంబర్లు ఉన్నాయా అనేది ఏప్రిల్‌ తరువాత క్షేత్ర స్థాయిలోకి వెళ్లి విచారణ చేపడుతాం. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం.

– ఆరిఫొద్దీన్‌, మున్సిపల్‌ ఆర్వో

Advertisement
Advertisement