రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా.. | Urvashi Rautela Makes History, Becomes First Actress To Buy This Car | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న ఊర్వశి.. మొట్టమొదటి నటిగా రికార్డు

Mar 12 2025 2:49 PM | Updated on Mar 12 2025 3:15 PM

Urvashi Rautela Makes History, Becomes First Actress To Buy This Car

బాసూ.. వేర్‌ ఈజ్‌ ద పార్టీ.. అంటూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఐటం సాంగ్స్‌కు పెట్టింది పేరైన ఈ బ్యూటీ ఏజెంట్‌, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో అలరించింది. ఇటీవలే డాకు మహారాజ్‌ మూవీలో కీలక పాత్రలో నటించడంతో పాటు దబిడి దిబిడి పాటతో సెన్సేషన్‌ సృష్టించింది. తాజాగా ఊర్వశి ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

కారు విలువ అన్ని కోట్లా?
భారత్‌లో ఏ నటికి సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.12 కోట్లు పెట్టి రోల్స్‌ రాయిస్‌ కులినన్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే ఈ కారు సొంతం చేసుకున్న మొట్టమొదటి నటిగా ఊర్వశి రికార్డుకెక్కనుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌లోనూ స్థానం దక్కించుకున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో వెల్‌కమ్‌ టు ద జంగిల్‌, కసూర్‌ 2 చిత్రాలున్నాయి. ఊర్వశి ఇటు సినిమాల్లో యాక్ట్‌ చేస్తూ, స్పెషల్‌ సాంగ్స్‌ చేయడమే కాకుండా ప్రైవేట్‌ సాంగ్స్‌ కూడా చేస్తూ ఉంటుంది.

విమర్శలపాలైన ఊర్వశి
డాకు మహారాజ్‌ సినిమా రూ.100 కోట్లపైనే వసూళ్లు రాబట్టినప్పుడు ఊర్వశి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన సినిమా సెంచరీ దాటిందని గర్వపడిపోయింది. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ దాడి గురించి స్పందించమన్నప్పుడు కూడా డాకు మహారాజ్‌ సినిమా గురించి చెప్తూ సొంత డబ్బా కొట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత తనకు తల్లి డైమండ్‌ రింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చిందని చూపించింది. 

ఇలాంటివి చేతికి ధరించి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని కామెంట్స్‌ చేసింది. సైఫ్‌పై సానుభూతి చూపించకుండా తన బహుమతులను చూపిస్తూ షోఆఫ్‌ చేయడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె తన తప్పిదం తెలుసుకుని సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. సైఫ్‌పై దాడి తీవ్రత తెలియకుండా మాట్లాడినందుకు క్షమించమని కోరింది.

చదవండి: చిల్లిగవ్వ లేదు.. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పని చేశాం: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement