Today Big Update From Dhanush New Movie Captain Miller - Sakshi
Sakshi News home page

Captain Miller: ధనుష్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. కొత్తమూవీ బిగ్ అప్‌డేట్..!

Sep 17 2022 3:06 PM | Updated on Sep 17 2022 4:12 PM

Today Big Update From Dhanush New Movie Captain Miller   - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ లేటెస్ట్‌ మూవీ బిగ్ అప్‌డేట్ ఇవాళ సాయంత్రం రానుంది. ఈ సినిమాకు 'కెప్టెన్ మిల్లర్‌' టైటిల్ ఖరారు చేశారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మూవీ నుంచి కీలక అప్‌డేట్ ఇవ్వనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఇప్పటికే  రిలీజ్‌ చేసిన ధనుష్‌ లుక్‌ అదిరిపోయింది. 

(చదవండి: Thiru OTT Streaming: ఓటీటీలోకి ధనుష్‌ తిరు మూవీ! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..)

ఈ సినిమాకు అరుణ్ మహేశ్వరన్ డైరెక్షన్ వహించనుండగా.. జీవీ ప్రకాశ్ సంగీత మందిస్తున్నారు. ఈ చిత్రానికి సెంథిల్ త్యాగరాజన్, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ రిలీజ్‌ చేసేలా చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.  ఇటీవల ధనుష్ నటించిన ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు) ఆగష్టు 18న విడుదలై హిట్ సాధించింది. తాజాగా ధనుష్ కొత్త చిత్రం అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement