సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్‌లో మెరిసిన కాబోయే వధూవరులు! | Sonakshi Sinha and Zaheer Iqbal Reception ceremony In mumbai | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్‌లో కాబోయే వధూవరులు!

Jun 23 2024 9:32 PM | Updated on Jun 23 2024 9:32 PM

Sonakshi Sinha and Zaheer Iqbal Reception ceremony In mumbai

బాలీవుడ్ భామ సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్‌, దక్షిణాది సినీతారలు సందడి చేశారు. బాంద్రాలో జరిగిన ఈ ఫంక్షన్‌లో కాబోయే వధూవరులు అదితి రావ్ హైదరీ,  సిద్ధార్థ్  మెరిశారు.

కాగా.. అదితి రావ్ హైదరీ,  సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చి 27న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా సోనాక్షి పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఇటీవలే హీరామండి వెబ్‌ సిరీస్‌లో ఆదితిరావు కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్‌లో సోనాక్షి సిన్హాతో కలిసి నటించింది. వీరిద్దరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కావడం వల్లే రిసెప్షన్‌ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. 2021 తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్‌లో సిద్ధార్థ్, అదితి మొదటిసారి కలుసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement