RRR Movie runtime interesting updates and trailer- Sakshi
Sakshi News home page

RRR Movie: ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌, హంగామా మామూలుగా లేదుగా!

Dec 9 2021 9:53 AM | Updated on Dec 9 2021 1:01 PM

RRR Movie runtime interesting updates and trailer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ టాప్ స్టార్స్‌, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. బిగ్‌  స్క్రీన్‌పై తొలిసారి స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా హీరో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ సాంగ్స్‌, మేకింగ్‌ వీడియోలు ఫ్యాన్స్‌కు మంచి కిక్కు ఇవ్వగా, థియేటర్లలో రిలీజైన ట్రైలర్‌ మరింత హంగామా సృష్టిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం, రణం, రుధిరం)  ట్రైలర్‌తో జక్కన్న  సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్‌ ఫిదా.  గూస్‌ బంప్స్‌ అంతే తెగ సంబర పడిపోతున్నారు.

‘‘పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పనిచేయగలిగింది ఒక్కడే సార్‌’’

‘‘పానం కన్నా నీ సోపతి నా సొంతం..’’

తొంగి..తొంగి నక్కి నక్కి గాదే... తొక్కుకుంటూ పోవాలే.. ఎదురు వచ్చినోడిని ఏసుకుంటూ   పోవాలే..’’

‘‘కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పద..’’ ఇలా పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో మరో సెన్సేషన్‌కు  రాజమౌళి బాటలు వేసేసాడు.

తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివితో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది.  దాదాపు  రూ. 400 కోట్లతో  ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement