విధ్వంసం ఆపేవాడు దేవుడు! | Ravi Teja Eagle trailer Launch | Sakshi
Sakshi News home page

విధ్వంసం ఆపేవాడు దేవుడు!

Dec 21 2023 5:50 AM | Updated on Dec 21 2023 5:50 AM

Ravi Teja Eagle trailer Launch - Sakshi

నవదీప్, అవసరాల, కావ్యా థాపర్, రవితేజ, అనుపమ, టీజీ విశ్వప్రసాద్, కార్తీక్‌

‘తుపాకీ నుండి వచ్చే బుల్లెట్‌ ఆగేది ఎప్పుడో తెలుసా... అది పట్టుకున్న వాణ్ణి తాకినప్పుడు...’ అంటూ నటుడు నవదీప్‌ చెప్పిన డైలాగ్‌తో ‘ఈగల్‌’ ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు... ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు... ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు’ అంటూ హీరో రవితేజ చెప్పిన డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ–‘‘ఈగల్‌’ సినిమా చాలా బావుంటుంది.

కార్తీక్‌ రూపంలో ఇండస్ట్రీకి మరో మంచి దర్శకుడు రాబోతున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్‌ ప్రొడక్షన్‌ లాంటింది. విశ్వ ప్రసాద్‌గారితో మరొక చిత్రం చేయబోతున్నా. జనవరి 13న థియేటర్స్‌లో కలుద్దాం.. కుమ్మేద్దాం’’ అన్నారు. ‘‘గత ఏడాది రవితేజ గారికి ‘ధమాకా’ అనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చాం. ‘ఈగల్‌’తో మరో బ్లాక్‌ బస్టర్‌కి రెడీ అవుతున్నాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌.

‘‘ఈగల్‌’ పండక్కి గొప్ప థియేట్రికల్‌ అనుభూతి ఇచ్చే చిత్రం. జనవరి 13న థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు కార్తీక్‌ ఘట్టమనేని. ఈ వేడుకలో అనుపమ, కావ్యా థాపర్, నటులు నవదీప్, శ్రీనివాస్‌ అవసరాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: డేవ్‌ జాంద్, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, కమిల్‌ ΄్లాకి, కర్మ్‌ చావ్లా, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌: సుజిత్‌ కుమార్‌ కొల్లి.

Advertisement
 
Advertisement
Advertisement