‘అరణ్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. అదే రోజు మరో సినిమా

Rana Daggubati Aranya Release Date Announced - Sakshi

ఎనిమిది నెలలపాటు మూగ బోయిన థియేటర్లలో సినిమాల పండుగ షూరు అయ్యింది. తొలుత ఒకటి రెండుతో ప్రారంభమైన సినిమాలు జనవరి సంక్రాంతితో థియేటర్లలలో సౌండ్స్‌ మోతమోగించేందుకు రెడీ అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో వాయిదా పడిన సినిమాలు ప్రస్తుతం వరుస పెట్టి రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అల్లుడు అదుర్స్‌, క్రాక్‌, రెడ్‌, రంగ్‌దే వంటి చిత్రాలు విడుదల తేదిని ప్రకటించగా.. తాజాగా దగ్గుబాటి రానా నటించిన చిత్రం ఈ జాబితాలోకి చేరిపోయింది. రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరణ్య సినిమా రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రభు సోలోమీన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. చదవండి: రానా మరో జర్నీ బిగిన్స్‌ : కిల్లర్‌ కాంబో

ఈ విష‌యాన్ని రానా త‌న ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. ‘కొత్త సంవ‌త్స‌రానికి సాధార‌ణ ప‌రిస్థితుల‌తో ఆహ్వానం చెబుతున్నాము. ‘హాథీ మేరీ సాథీ, అర‌ణ్య‌, కాద‌న్ సినిమా 26న మీ ద‌గ్గరలోని థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది’. అని రానా ట్వీట్ చేశారు. కాగా అదే రోజున వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్‌ నటించిన రంగ్‌ దే చిత్రం కూడా విడుదలవ కాబోతుంది. దీంతో మార్చి 26 రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతోపాటు జోయా హుస్సేన్, కల్కి కణ్మిణీ, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, శ్రియా పిలగోన్కర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వాస్తవానికి ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. చదవండి: ప్రభాస్‌ సలార్‌ అప్‌డేట్‌, విలన్‌ అతడేనా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top