RGV Praises Allu Arjun Over Pushpa Movie In Bollywood Success, Tweet Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ, ట్వీట్‌ వైరల్‌

Jan 6 2022 9:38 AM | Updated on Jan 6 2022 1:05 PM

Ram Gopal Varma Praises Allu Arjun Over Pushpa Movie In Bollywood Successes - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయంపై అయినా వ్యంగ్యంగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్‌ చేస్తుంటాడు ఆర్జీవీ. అలా తరచూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఏ ఒక్కరిని వదలడు. అందరిపై ఒకేలా తన వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటాడు. అయితే ఆయన ఒకరిని ప్రశంసించడం కంటే విమర్శలు చేయడం ఎక్కువ. ఈ క్రమంలో వర్మ తరచూ వివాదాలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తుంటాడు.

చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్‌

ఇక ప్రస్తుతం ఏపీ మూవీ టికెట్ల వివాదంపై వరుస ట్వీట్‌లు  చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆసక్తిగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించాడు. ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకేళ్లావు అంటూ బన్నీని పొగడ్తలతో ముంచెత్తాడు ఆర్జీవీ. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘హే అల్లు అర్జున్, ఆంథిమ్, సత్యమేవ జయతే 2, 83 వంటి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ..

చదవండి: నాకింకా 29 మాత్రమే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి

వాటన్నింటిని వెనక్కి నెట్టి పుష్పతో ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకేళ్లావు. ఈ ఘనత నీకే చెందుతుంది. కుదోస్’ అంటూ అని బన్నీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక హిందీలో ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది పుష్ప. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సూపర్ హిట్ లెవల్లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో విడుదలై నెల తిరక్కుండానే పుష్మ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‎లో పుష్ప జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement