103 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి, ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌ | Prabhas Adipurush Movie Shooting Wrapped Up In 103 Days | Sakshi
Sakshi News home page

Prabhas Adipurush Movie: 103 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి, ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌

Nov 11 2021 5:02 PM | Updated on Nov 11 2021 5:25 PM

Prabhas Adipurush Movie Shooting Wrapped Up In 103 Days - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్'. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో 3డీ చిత్రంగా ఆది పురుష్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకేశుడు రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ పోషించారు. 

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమై మూడు నెలలపైనే అవుతుంది. అయితే పాన్‌ ఇండియా చిత్రం కావడంతో షూటింగ్‌ పూర్తవడానికి ఏళ్లు పడుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యంగా 103 రోజుల్లో ఆది పురుష్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని తాజాగా డైరెక్టర్‌ ఓంరౌత్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. 

‘ఆదిపురుష్‌ షూట్‌ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ను మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇంత స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేయ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన నెటిజ‌న్స్ అంతే స్పీడ్‌గా మూవీ అప్‌డేట్స్ కూడా ఇవ్వండ‌ని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ మూవీని భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement