Payal Rajput Bold Reply To Trollers Who Troll Her In Social Media - Sakshi
Sakshi News home page

Payal Rajput: సోషల్‌ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్‌

Dec 7 2021 9:19 PM | Updated on Dec 8 2021 9:15 AM

Payal Rajput Bold Reply To Trollers Who Troll Her In Social Media - Sakshi

Payal Rajput Response On Trolls Over Her PhotoShoot Video: పంజాబీ భామ పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ ఫోటో షూట్‌ చేసి ట్రోల్స్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఒపెన్‌ టాప్‌తో ఫొటోలకు పోజుల ఇచ్చి సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదుర్కొంది ఈ బోల్డ్‌ బ్యూటీ. కాగా పాయల్‌ ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలి సినిమాలోనే బోల్డ్‌గా నటించింది. అయితే ఆ సినిమా తర్వాత వెంకి మామ వంటి చిత్రాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. బోల్డ్‌ బ్యూటీగా పాపులర్‌ అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఈ భామకు తక్కువే ఉన్నాయి.

చదవండి: సిరివెన్నెల చివరి పాటపై సాయి పల్లవి భావోద్వేగం

ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్.. ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకోవడానికి హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. అలా ఫోటో షూట్స్ చేసి వాటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవ‌ల ఓ ఫోటోషూట్‌కు సంబంధించి ‘బి హైండ్ ది సీన్స్’ అంటూ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో అత్యంత అసభ్యకరంగా ఉండటంతో వెంటనే తేరుకుని డిలీట్ చేసేసింది. అయితే అప్ప‌టికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు డౌన్‌లోడ్ చేసి తెగ వైర‌ల్ చేశారు.

చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన

ఆ వీడియో షేర్‌ చేస్తూ పాయల్‌ను ట్రోల్‌ చేశారు విమర్శకులు. ఈ క్రమంలో ట్రోల్స్‌పై స్పందించిన పాయ‌ల్ విమర్శకులను నిందిస్తూ ‘ఇతర మహిళల వ‌ద్ద ఉన్న‌దే నా ద‌గ్గ‌ర‌ ఉంది. వారి వద్ద లేనిది కొత్తగా నా దగ్గర ఏం లేదు’ అంటూ బోల్డ్‌గా కౌంటర్‌ ఇచ్చింది. అలాగే ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చూసి టార్గెట్ చేయడం మానుకోవాలని విమర్శకులను కోరింది. ఆన్‌లైన్‌లో పని లేని వాళ్ళు వీడియోను మార్ఫింగ్ చేసి దానిని వ్యాప్తి చేశారని ఆమె ఆరోపించింది. లోదుస్తులు లేకుండా కోటుతో చేసిన ఫోటోషూట్‌లో పాయల్‌ అభ్యంతరకరంగా కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

చదవండి: విడాకులపై సమంత కామెంట్స్‌, వైరల్‌ అవుతోన్న చై-సామ్‌ ఓల్డ్‌ ఫోన్‌ కాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement