
Jr NTR Comments On Ram Charan And Multistarrer Movies In RRR Promotions: టాలీవుడ్‌లో మల్టీ స్టారర్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు సైతం మల్టీస్టారర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ కూడా మల్టీస్టారరే. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జనవరి7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తూ అక్కడి ప్రేక్షకులకు సైతం దగ్గరవుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు వచ్చే అవకాశాలున్నాయి అని ప్రశ్నించగా ఎన్టీఆర్ ఆసక్తికరంగా స్పందించారు.
'ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తుంది. అయినా మేమిద్దరం(నేను,రామ్‌చరణ్)మంచి స్నేహితులం. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత దేశంలోని టాప్ స్టార్స్ సైతం ఒకే తాటిపైకి వస్తారని, భారీ మల్టీ స్టారర్ చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.