కెప్టెన్‌గా శోభ‌.. ఈ వారం ఎవ‌రు బ‌లి కానున్నారు? | Bigg Boss Telugu 7: 9th Week Elimination Analysis | Sakshi
Sakshi News home page

Shobha Shetty: కెప్టెన్‌గా శోభా శెట్టి.. ఎలిమినేష‌న్ గండం గ‌ట్టెక్కుతుందా?

Nov 3 2023 4:05 PM | Updated on Nov 3 2023 5:48 PM

Bigg Boss Telugu 7: 9th Week Elimination Analysis - Sakshi

త‌ను కెప్టెన్ అయితే వ‌చ్చేవారం ఇమ్యూనిటీ ల‌భిస్తుంది. కానీ ఈ వారం ల‌భించ‌దు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే శోభా కోసం అమ‌ర్ గేమ్ ఆడి గెలిపించాడట‌. అది కూ

బిగ్‌బాస్ షోలో తొమ్మిదో వారం ఎలిమినేష‌న్ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. అమర్‌ దీప్‌, రతికా రోజ్‌, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, అర్జున్‌, టేస్టీ తేజ, భోలే షావలి, ప్రిన్స్‌ యావర్‌.. ఈ వారం నామినేష‌న్‌లో ఉన్నారు. శోభ‌, తేజ‌ల‌కు ఆల్‌రెడీ ఎలిమినేష‌న్ భ‌యం ప‌ట్టుకుంది. నిజానికి శోభ గ‌త‌వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్‌.. అయితే త‌ను వెళ్లిపోతే షో చ‌ప్ప‌గా ఉంటుంద‌నుకున్నారో, మ‌రేంటో కానీ ఆమెను సేవ్ చేసి సందీప్ మాస్ట‌ర్‌ను పంపించేశారు. 

శోభా కోసం మ‌రొక‌రు బ‌లి?
ఈ వారం కూడా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలోని అన‌ధికారిక పోల్స్‌లో కూడా శోభా త‌క్కువ ఓట్ల‌తో చివ‌రి స్థానంలో ఉంది. దీంతో ఆమె ఎలిమినేష‌న్ ఖాయ‌మే అని నెటిజ‌న్లు ఫిక్స‌యిపోతున్నారు. కానీ ఇలాంటి గ్లామ‌ర‌స్‌, అలాగే త‌న‌ అరుపుల‌తో హౌస్‌ను ద‌ద్ద‌రిల్లేలా చేసే కంటెస్టెంట్ వెళ్లిపోతే షో నీర‌సించిపోవ‌డం, టీఆర్పీ దెబ్బ‌తిన‌డం ఖాయం. ఈ ర‌కంగా బిగ్‌బాస్ ఆలోచిస్తే మాత్రం మ‌రోసారి త‌న‌కు బ‌దులుగా మ‌రో కంటెస్టెంట్‌ను పంపించే ఆస్కారం లేక‌పోలేదు.

అప్పుడు చైతూ ఎలిమినేట్‌!
ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఈ వారం ఇంటి కెప్టెన్‌గా శోభా అవ‌త‌రించిన‌ట్లు తెలుస్తోంది. త‌ను కెప్టెన్ అయితే వ‌చ్చేవారం ఇమ్యూనిటీ ల‌భిస్తుంది. కానీ ఈ వారం ల‌భించ‌దు. ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే శోభా కోసం అమ‌ర్ గేమ్ ఆడి గెలిపించాడట‌. అది కూడా బీన్ బ్యాగ్ గేమ్‌. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజ‌న్‌లోనూ ఇలాంటి టాస్కే న‌డిచింది. అప్పుడు ఆర్జే చైతూ కోసం అఖిల్ ఆడాడు.. తాను గెలిచి చైతూను కెప్టెన్ చేశాడు. కానీ ఆ వారం చైతూ నామినేష‌న్స్‌లో ఉండ‌టంతో కెప్టెన్సీ ప‌వ‌ర్ అనుభ‌వించ‌కుండానే ఎలిమినేట్ అయిపోయాడు. మ‌రి ఈ వారం శోభా కెప్టెన్సీని అనుభ‌వించ‌క‌ముందే ఎలిమినేట్ అవుతుందా? లేదంటే త‌న‌కోసం తేజ లేదా ఏ ఇత‌ర కంటెస్టెంట్‌నైనా బ‌లి చేయ‌నున్నారా? అనేది చూడాలి!

చ‌ద‌వండి: ఏం తప్పు చేశానో చెప్పండి?.. శివాజీపై మండిపడ్డ గౌతమ్!

Advertisement
 
Advertisement
Advertisement