బిగ్‌బాస్‌: కెప్టెన్‌గా ఎన్నికైన‌ సోహైల్‌! | Bigg Boss 4 Telugu: Sohel Become Fifth Captain In House | Sakshi
Sakshi News home page

మెహ‌బూబ్‌ సోహైల్‌కు స‌పోర్ట్ చేస్తాడా?

Oct 8 2020 3:57 PM | Updated on Oct 8 2020 5:13 PM

Bigg Boss 4 Telugu: Sohel Become Fifth Captain In House - Sakshi

బిగ్‌బాస్ ఇచ్చిన బీబీ హోట‌ల్ టాస్క్‌లో అతిథులు స‌క‌ల మ‌ర్యాదలు చేయించుకుంటూ అన్ని సేవ‌ల‌ను పొందారు. కానీ హోట‌ల్ సిబ్బంది మాత్రం నానా క‌ష్టాలు ప‌డినా కేవ‌లం టిప్పు ద‌క్కించుకున్నారే త‌ప్పితే స్టార్లు మాత్రం పొంద‌లేదు. అయితే అతిథులెవ‌రూ స్టార్లు ఇచ్చేలా క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిజిత్ త‌న మెద‌డుకు ప‌దును పెట్టాడు. అత‌ను 5 స్టార్ల‌ను దొంగిలించి హారిక చేతిలో పెట్టాడు. త‌ర్వాత ఆమె ఒక్క స్టార్ ఇస్తానంటుంటే విన‌కుండా ఉన్న‌వ‌న్నీ లాగేసుకున్నాడు. హారిక బాధ‌ప‌డుతున్నా వినలేదు. కానీ ఈ టాస్క్‌లో అత‌ని ఎత్తు పార‌లేద‌ని తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనేందుకు సోహైల్ మెహ‌బూబ్‌తో చ‌ర్చిస్తుండ‌టాన్ని చూస్తుంటే అతిథులే విజేత‌లుగా నిలిచార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. (చ‌ద‌వండి: అభిజిత్‌ మైండ్‌ గేమ్‌.. కంటతడి పెట్టిన హారిక)

ఇక గ‌తంలో ఆడిన కాయిన్ల టాస్కులో కంటి మీద కునుకు లేకుండా క‌ష్ట‌ప‌డి దొంగిలించిన కాయిన్ల‌ను సోహైల్.. త‌న స్నేహితుడు మెహ‌బూబ్‌కు త్యాగం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని అత‌డు ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ.. "ఇంత‌కుముందు నేను నీకు ఛాన్స్ ఇచ్చాను. కాబ‌ట్టి ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వు. ఫ్రెండ్‌షిప్‌కు విలువిస్తే నాకు అవ‌కాశ‌మివ్వు, లేదంటే నీ ఇష్టం" అని దిల్‌సేను ముక్కుసూటిగా అడిగాడు. దీంతో అయోమ‌యంలో ప‌డ్డ మెహ‌బూబ్ స్నేహితుడికి స‌పోర్ట్ చేస్తాడా? లేదా? చూడాలి. మ‌రోవైపు బిగ్‌బాస్ హౌస్‌కు సోహైల్ ఐదో కెప్టెన్‌గా ఎన్నిక‌య్యాడ‌ని లీకువీరులు ట‌ముకు వేసి మ‌రీ చెప్తున్నారు. ఇక‌ అభిజిత్ స్టార్లను దొంగిలించ‌డంపై సెటైర్లు వినిపిస్తున్నాయి. 'నొక్కేయాల్సిన కాయిన్ల టాస్కులో సైలెంట్‌గా కూర్చున్న‌దే కాకుండా దొంగ‌త‌నం చేసిన‌వాళ్ల‌పై అరిచాడు.. ఇప్పుడేమో సంపాదించాల్సిన చోట నొక్కేశాడు. ఇదేం గేమ్‌రా బాబూ‌!", "రేపు అభిజిత్ త‌న సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇస్తేనే సినిమా విడుద‌ల చేస్తాడేమో"న‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ను వ‌దిలేది లేదంటున్న నాగ్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement