బిగ్‌బాస్‌: బ‌య‌ట‌ప‌డ్డ నోయ‌ల్ మోసం Bigg Boss 4 Telugu: Noel Sean Lied About Her Father | Sakshi
Sakshi News home page

తండ్రి గురించి అబ‌ద్ధం చెప్పిన నోయ‌ల్‌!

Published Sun, Oct 18 2020 6:13 PM

Bigg Boss 4 Telugu: Noel Sean Lied About Her Father - Sakshi

బిగ్‌బాస్ రియాలిటీ షోలో మొన్నామ‌ధ్య కంటెస్టెంట్లు రియ‌ల్ లైఫ్ క‌ష్టాలు చెప్పి అంద‌రినీ కంట‌త‌డి పెట్టించేశారు. చాలా మంది కంటెస్టెంట్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచే వ‌చ్చార‌ని, ఎన్నోక‌ష్ట‌న‌ష్టాలు అనుభ‌వించాకే ఈ స్థాయికి వ‌చ్చార‌ని తెలిసి ప్రేక్ష‌కులు కూడా భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ స‌మ‌యంలో సింగ‌ర్ నోయ‌ల్ త‌న కుటుంబం గురించి చెప్తూ.. మా అమ్మ అంద‌రి ఇళ్ల‌ల్లో ప‌ని చేసేది. నాన్న ర‌క‌ర‌కాల ప‌నులు చేసేవాడు. ఇస్త్రీ, మేస్త్రీ ప‌ని చేస్తూ డ‌బ్బులు సంపాదించేవాడు అని చెప్పాడు. (చ‌ద‌వండి: అరియానాకు సారీ చెప్పి తినిపించిన సోహైల్‌)

వికీపీడియాలో వెల్ల‌డైన నిజం
కానీ వికీపీడియాలో అత‌డి తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది. దీంతో ప్రేక్ష‌కుల‌ను బ‌క‌రా చేసిన నోయ‌ల్ మోసం బ‌య‌ట‌ప‌డింద‌ని అత‌ని యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అయినా కూడా రోజువారీ కూలీ అన్న‌ట్లుగా చెప్పి సింప‌తీ ఓట్లు పొందాల‌ని చూస్తున్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక వికీపీడియాలో ఓసారి అత‌డి తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అని, మ‌రోసారి కూలీ అని మార్చేసి ఉన్న ఫొటోల‌ను పంచుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారంతో నోయ‌ల్ అభిమానుల‌కు దిమ్మ‌తిరిగిపోయింది. ఏదేమైనా స‌పోర్ట్ చేయ‌డ‌మే వారి ప‌ని కాబ‌ట్టి, అత‌డి తండ్రి అంత‌కు ముందు డెయిలీ లేబ‌ర్ కావ‌చ్చ‌ని, త‌ర్వాత ఆ ఉద్యోగంలో చేరాడేమోన‌ని వెన‌కేసుకువ‌స్తున్నారు. (చ‌ద‌వండి: గంగ‌వ్వ‌లాగే న‌న్ను పంపించేయండి: నోయ‌ల్)

నిజ‌మైన నోయ‌ల్ బ‌య‌ట‌కు రావాలి: నాగ్‌
అస‌లే ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న నోయ‌ల్ ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రుస్తున్నాడు. మొద‌ట్లో క‌నీసం ర్యాప్ సాంగ్స్‌తో అయినా ఎంట‌ర్‌టైన్ చేసేవాడు. కానీ ఇప్పుడు పాటా లేదు, ఆటా లేదు. ఇంట్లో ఉన్నాడా? లేడా? అన్న‌ట్లుగా మెదులుతున్నాడు. గంగ‌వ్వ‌లాగే త‌న‌నూ పంపిచేయండి అంటూ అత‌డిని విన్న‌ర్‌గా చూడాల‌న్న అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. ఇక‌ నిన్న‌టి ఎపిసోడ్‌లో నాగ్ సైతం నిజ‌మైన మాకు నిజ‌మైన నోయ‌ల్ కావాలి అని పేర్కొన‌డం అత‌డు మాస్క్ వేసి ఆడుతుతున్న విష‌యాన్ని ప‌రోక్షంగా ఎత్తి చూపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement