Alia Bhatt And Ranbir Kapoor Blessed With Baby Girl At HN Reliance Hospital - Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా

Nov 6 2022 1:14 PM | Updated on Nov 6 2022 1:44 PM

Alia Bhatt And Ranbir Kapoor Blessed With Baby Girl - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తల్లైయింది. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. రణబీర్‏తోపాటు సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆసుపత్రిలో అలియాతో ఉన్నట్లుగా సమాచారం.  తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు కపూర్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. 

కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న రన్బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గర్భిణీగా ఉన్నా షూటింగ్స్‌తో పాటు బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్‌లోనూ ఆమె యాక్టివ్‌గా పాల్గొంది.పాప రాకతో కపూర్‌ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా ఆలియా, రణ్‌బీర్‌లకు శుభాకాంక్షలులు వెల్లువెత్తున్నాయి. అలియా తల్లి అయ్యారని తెలుసుకున్న అభిమానులు, సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ తెలియజేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement