
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమ వారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 119 వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తులు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ ఫుడ్ క్యాంటీన్‌ను పరిశీలించారు. జంక్ ఫుడ్‌తో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ఈసందర్భంగా మహిళా శక్తి ద్వారా ఆర్థిక సాయంతో మిల్లెట్ ఫుడ్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన అనితను అభినందించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే ఇలాంటి ఆహారం అందించడం అభినందనీయమని కొనియాడారు. అనితను స్ఫూర్తిగా తీసుకొని మిగితా సంఘాల సభ్యులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, డీపీఓ యాదయ్యతో పాటు జిల్లాలోని వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలు పెండింగ్ ఉండొద్దు
అధికారులకు కలెక్టర్
రాహుల్‌రాజ్ ఆదేశం