అకాల వర్షం.. తడిసిన వరి ధాన్యం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. తడిసిన వరి ధాన్యం

Published Thu, May 9 2024 4:55 AM

అకాల

మహమ్మదాబాద్‌: మండలంలోని గాధిర్యాల్‌, చౌదర్‌పల్లి, పెద్దతండా, మంగంపేట, మహమ్మదాబాద్‌, మొకర్లాబాద్‌లో బుధవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిపోయింది. యాసంగిలో సాగుచేసిన పంటలకు సాగునీరు అందక దాదాపు 60 శాతం పంటలు ఎండిపోగా మిగిలిన కొద్దిపాటి చేతికొచ్చిన పంట కూడా అమ్ముకునే సమయానికి తడిపోయిందని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. మరోవైపు కోతకొచ్చిన వరిపంట వడ గండ్ల వర్షానికి చేతికందే పరిస్థితి లేదని తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తాపడి

విద్యార్థి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

మద్దూరు/కోస్గి: రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తపల్లి మండల కేంద్రం శివారులోని దొంగకల్వర్టు వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గుండుమాల్‌ చెందిన ముదిరెడిపల్లి శివకుమార్‌(20) ఇదే గ్రామానికి చెందిన స్నేహితుడు కేశపోళ్ల కృష్ణ(20) కలిసి శివకుమార్‌ పొలంలో ఉన్న ట్రాక్టర్‌ నేర్చుకుందామని తీశారు. కేశపోళ్ల కృష్ణ కారు డ్రైవర్‌ కావడంతో ట్రాక్టర్‌ను నడిపాడు. ఈ క్రమంలో శివకుమార్‌ కొత్తపల్లి మీదుగా గుండుమాల్‌కు వెళ్లే క్రమంలో కొత్తపల్లి శివారులోని దొంగ కల్వర్టు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి పడిపోవడంతో ముదిరెడ్డిపల్లి శివకుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా కృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుడి తండ్రి ముదిరెడ్డిపల్లి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాంలాల్‌ తెలిపారు. మృతుడు ఇటీవలే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాఽధించారు.

వీధికుక్కల దాడిలో బాలుడికి గాయాలు

గట్టు: వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు గాయపడిన ఘటన మండలంలోని తప్పెట్లమొర్సులో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన హరి ఒంటరిగా కిరాణ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి కుక్కలను తరిమివేశారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని.. వీటి బారినపడి చాలామంది గాయపడినట్లు గ్రామస్తులు వివరించారు.

అకాల వర్షం..  తడిసిన వరి ధాన్యం
1/1

అకాల వర్షం.. తడిసిన వరి ధాన్యం

Advertisement
Advertisement