నామమాత్రంగానే ‘రైతన్నా మీకోసం’
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో రైతన్న మీ కోసం కార్యక్రమం నామమాత్రంగానే ముగిసింది. ఈ నెల 24 నుంచి 29 వరకు ఆరు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో అన్నదాతలు అనేక సమస్యలు ఏకరవు పెట్టినా స్పందన లేకుండా పోయింది. ‘మొక్కజొన్నకు ధరలు పడిపోయాయి.. మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి’ అని జిల్లా కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యేల ఎదుట మొరపెట్టుకున్నా స్పందన లేకుండా పోయింది. మద్దతు ధర రూ.2400 ఉండగా మార్కెట్‌లో కేవలం రూ.1500– రూ.1600 వరకు మాత్రమే లభిస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నా చంద్రబాబు సర్కార్ మనస్సు కరుగలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కార్యక్రమాన్ని మమ అనిపించినట్లు తెలుస్తోంది.
నామమాత్రంగానే ‘రైతన్నా మీకోసం’


