కప్పం కట్టాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

కప్పం కట్టాల్సిందే!

Nov 30 2025 7:26 AM | Updated on Nov 30 2025 7:26 AM

కప్పం

కప్పం కట్టాల్సిందే!

నదిలోని ఇసుకను లూటీ చేస్తున్నారు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆంగ్లేయుల పాలనలో ప్రజలతో కప్పం కట్టించుకునే ఆచారం నేడు చంద్రబాబు సర్కార్‌ పాలనలో సాగుతోంది. ఇసుక ఉచితం అని చెప్పినా టీడీపీ నాయకులకు కప్పం కట్టి తీసుకెళ్లాల్సి వస్తోందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న హొళగుంద మండలంలో వేదావతి నదిని టీడీపీ నాయకులు లూటీ చేస్తున్నారు. ‘ఇసుక ఉచితం’ అనే చంద్రబాబు ప్రభుత్వ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ వైకుంఠం జ్యోతి అనుచరులు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు, మండల స్థాయి నాయకులు, పోలీసుల అండదండలతో నది పరిసరాల్లో వసూళ్ల పర్వాన్ని మొదలెట్టారు. నిర్మాణాలు, ఇతర పనులకు ఇసుకు కావాలంటే ఎలాంటి చలానా ఇవ్వకుండా ప్రతి ట్రిప్పుకు రూ.500 చెల్లించాల్సిందే. కాదు కూడదు అంటే పోలీసులు వచ్చి ట్రాక్టరును స్టేషన్‌కి తరలిస్తారు. ఇలా రోజుకు వందకు పైగా ట్రిప్పులు నది నుంచి బయటకెళ్తున్నాయి. ఈ లెక్కన ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే రోజుకు రూ.50 వేలకు పైగానే జేబులు నింపుకుంటున్నారు. దీన్ని తలా ఇంత పంచుకుంటున్నట్లు సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా..

నదిలో వరద నీరు ప్రవహిస్తున్నా అందులోనే ఇసుకను తవ్విస్తున్నారు. నిబంధనకు విరుద్ధంగా ట్రిప్పుకు రూ.500 ఇస్తూ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. నదిలో నీరు పారుతున్నా అందులోనే ఇసుకను తోడి ట్రాక్టర్లలో లోడింగ్‌ చేస్తున్నారు. మైన్స్‌ అండ్‌ జియాలజిస్ట్‌, స్థానిక రెవెన్యు అధికారుల అనుమతి లేకుండా భారీ ఎత్తున ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దందాను అరికట్టాల్సిన స్థానిక పోలీసులు, అధికారులు మామూళ్లతో మిన్నకుండి పోతున్నట్లు ఆ ప్రాంత ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలోని ఇసుకను చుట్టు పక్కల గ్రామాల వారు తీసుకెళ్తే ఎలాంటి కొరత ఉండదు. అయితే వ్యాపారం చేసుకునేందుకు భారీ ఎత్తున ట్రాక్టర్లతో పట్టణాలకు తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు సర్కార్‌లో టీడీపీ నాయకులు మద్యం, ఇసుక దేన్నీ వదలడం లేదు. మార్లమడికి వద్ద ఉన్న వేదావతి నది నుంచి టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్గీయులు ట్రాక్టర్‌కు రూ.500 తీసుకుని ఇసుక దందా నడిపిస్తున్నారు. అది ఇవ్వని వారి ట్రాక్టర్లను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇంతకు ముందు పోలీసులు టీడీపీ వాళ్ల ట్రాక్టర్లకు మాత్రమే ఇసుకు దొచుకునేందుకు అవకాశమిచ్చి ఇతరుల ట్రాక్టర్లను సీజ్‌ చేసే వారు. ఇప్పుడు ఏకంగా డబ్బులు వసూలు చేసుకుని తలా ఇంత పంచుకుంటున్నారు. దీని వల్ల భూగర్భ జలాలు అడగంటాయి. రోడ్లు దెబ్బతింటాయి. ఈ దందాను అడ్డుకుంటాం. జిల్లా కలెక్టర్‌, మైన్స్‌, సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలి.

– బుసినె విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే

టీడీపీ నాయకుల ఇసుక దందా

డబ్బులు ఇస్తే రైట్‌.. లేదంటే నో!

ఉచితం పేరిట వేదావతిని

ఖాళీ చేస్తున్న ఇసుక మాఫియా

పట్టించుకోని అధికారులు

కప్పం కట్టాల్సిందే!1
1/2

కప్పం కట్టాల్సిందే!

కప్పం కట్టాల్సిందే!2
2/2

కప్పం కట్టాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement