తుమకూరు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్టు | Sakshi
Sakshi News home page

తుమకూరు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్టు

Published Sun, Mar 24 2024 1:15 AM

ఘటన స్థలంలో పోలీసులు  - Sakshi

తక్కువ ధరకు బంగారు ఇస్తామని

పిలిపించి నగదు దోపిడీ, హత్య

కాలిపోయిన ముగ్గురి మృతదేహాల గుర్తింపు

తుమకూరు : తుమకూరు తాలూకా కోరా పోలీస్‌ స్టేషన్‌ పరిధి కుచ్చంగి చెరువులో కారులో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమైన కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. తుమకూరుకు చెందిన స్వామి అనే వ్యక్తి బంగారు తక్కువ ధరకు ఇస్తానని చెప్పి ముగ్గురిని పిలిపించాడు. నకిలీ బంగారు చూపించి డబ్బులు దోచుకుని ముగ్గురిని చితకబాది కట్టేసి హత్య చేసి కారుకు నిప్పు పెట్టాడు.

బంగారు కోసం వచ్చి ప్రాణాలు బలి :
దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడికి చెందిన ఇషాక్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. డీల్‌ ఉందని స్నేహితుడి కారు తెచ్చుకున్నాడు. అతనితో స్నేహితులు పాటు హమీద్‌ (45), ఇంతియాజ్‌ (34)లను కూడా తీసుకువచ్చాడు. గురువారం ముగ్గురు తుమకూరు వచ్చారు. స్వామిని కలిసి బంగారు విషయం మాట్లాడారు. నగదు ఉన్న విషయం గుర్తించిన స్వామి చెరువు ప్రాంతాల్లో మాట్లాడటానికి తీసుకెళ్లి ముగ్గురిని బంధించి హత్య చేసి నగదు తీసుకుని కారుకు నిప్పంటించి పారిపోయాడు.

గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఇషాక్‌ ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. కేసు విషయం సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కారు నెంబర్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.

Advertisement
Advertisement