
కూలీగా మారిన కళాకారుడు
జూలపల్లి(పెద్దపల్లి): తెలంగాణ ఉద్యమంలో ఆటాపాటలతో ఉద్యమకారులను ఉర్రూతలూగించిన కోనరావుపేటకు చెందిన కళాకారుడు మల్లారపు అనిల్ ఉపాధి కరువై కూలీగా మారాడు. మిలియన్ మార్చ్‌లోనూ కాళాకారులతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రత్యేక వేతనంతో కళాకారులను నియమించగా.. ఇందులో అనిల్‌కు స్థానం లభించలేదు. సంక్షేమ పథకాల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో అప్పటి కలెక్టర్ శ్రీదేవసేన ప్రశంసాపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు, సంక్షేమ పథకాల ప్రచారంలో తనదైన ముద్ర వేస్తున్న అనిల్‌కు సాంస్కృతిక శాఖ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇంటర్వ్యూకు పిలిచినా..
కొందరు ఉద్యమ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక ఉద్యోగావకాశాలు కల్పించింది. కానీ, అనిల్‌కు అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019 జనవరి 13న ఇంటర్వ్యూలకు పిలిచి, పాటలు పాడించింది. ఆ తర్వాత కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఇప్పటికై నా తనకు ప్రోత్సాహం అందించాలని అనిల్ కోరుతున్నాడు.