రారండోయ్‌.. సర్కారు బడికి | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌.. సర్కారు బడికి

Jun 8 2025 12:40 AM | Updated on Jun 8 2025 12:40 AM

రారండ

రారండోయ్‌.. సర్కారు బడికి

ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ఒక్కో ఊరిలో ఒక్కో విధమైన వినూత్న ప్రచారంతో ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడి ప్రత్యేకతలను, అందులో చదివితే వచ్చే లాభాలను గురించి తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరిస్తున్నారు. నర్సరీ చదువుల నుంచే రూ.లక్షలు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల కన్నా.. ఉచిత విద్య, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించే ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచిస్తున్నారు. ఆడియో, వీడియో, రీల్స్‌, ప్రచార రథాలు, పరీక్షల ఫలితాల కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బడిబాట కార్యక్రమం జోరందుకుంది. ఈసందర్భంగా సర్కార్‌ బడుల బలోపేతానికి పాటుపడుతున్న పలువురు ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై కథనం.

ఏఐతో ప్రచారం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తూ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేలా చేస్తున్నాడు మండలంలోని వల్లంపట్ల హైస్కూల్‌ గణిత ఉపాధ్యాయుడు పత్తి వంశీధర్‌రెడ్డి. పాఠశాలలో జరిగిన అభివృద్ధి, విద్యార్థుల ఉత్తీర్ణత, సదుపాయాలు, ఉపాధ్యాయుల వివరాలు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఏఐ పరికరం యాంకరింగ్‌ చేస్తుంది. దీనిని వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేస్తున్నట్లు ఉపాధ్యాయుడు తెలిపారు. దీనిని స్కూల్‌ ప్రమోషన్‌ యాక్టివిటీలో భాగంగా కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

బ్యాండ్‌మేళంతో ఆహ్వానం

శంకరపట్నం(మానకొండూర్‌): సర్కార్‌ బడిలో పిల్ల లను చేర్పించాలని శంకరపట్నం మండలం వెంకటేశ్వర్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కోటేశ్వర్‌రావు బ్యాండ్‌ మేళంతో ప్రచారం చేస్తారు. హెచ్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యార్థులకు యోగా, దేశభక్తి, సత్ప్రవర్తన గురించి వివరిస్తూ నవోయద ప్రవేశం కోసం శిక్షణ ఇస్తున్నారు. సర్కార్‌ బడిలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రైవేట్‌ వద్దు– సర్కార్‌ బడి ముద్దు నినాదంతో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. బడిబాటలో తల్లిదండ్రులతో పాటు అవ్వతాతలను భాగస్వామ్యులను చేసేందుకు బ్యాండ్‌మేళంతో ఆహ్వానిస్తూ గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఇటీవల విస్తరి ఆకుల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు వాటిలో భోజనం వడ్డించడంతో హెచ్‌ఎంను కలెక్టర్‌ పమేలాసత్పతి ప్రశంసించారు. విద్యార్థులకు క్రీడాదుస్తులు, స్కూల్‌ బ్యాగులు అందించేలా గ్రామంలో ఆర్థికంగా ఉన్నవారిని ప్రోత్సహించడంతో గతేడాది ఇద్దరు దాతలు ముందుకొచ్చారు. మెట్‌పల్లి అనుబంధ గ్రామం వెంకటేశ్వర్లపల్లి స్కూల్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు హెచ్‌ఎం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

రారండోయ్‌.. సర్కారు బడికి1
1/3

రారండోయ్‌.. సర్కారు బడికి

రారండోయ్‌.. సర్కారు బడికి2
2/3

రారండోయ్‌.. సర్కారు బడికి

రారండోయ్‌.. సర్కారు బడికి3
3/3

రారండోయ్‌.. సర్కారు బడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement