చి‘వరి’కి ట్యాంకర్‌ నీరు | Sakshi
Sakshi News home page

చి‘వరి’కి ట్యాంకర్‌ నీరు

Published Fri, Mar 29 2024 1:30 AM

-

యాసంగిలో సాగుచేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌ గ్రామానికి చెందిన పూరెల్ల అంజయ్యకు మూడెకరాల భూమి ఉంది. సాగునీటి కొరతతో ఎకరంన్నరలో వరి వేశాడు. పంట పొట్టదశలో ఉండగా ఎస్సారెస్పీ కాలువ నీళ్లు రాక, వ్యవసాయ బావిలో నీళ్లు అడుగంటడంతో పొలం ఎండిపోయే దశకు వచ్చింది. దీంతో పంటను కాపాడుకునేందుకు రెండు రోజుల నుంచి వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా బావిలో నీళ్లు నింపుతున్నాడు. రోజుకు ఐదు నుంచి ఆరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు బావిలో పోస్తున్నట్లు అంజయ్య తెలిపాడు. ట్యాంకర్‌కు రూ.1000 చొప్పున ఇప్పటి వరకు రూ.15వేలు చెల్లించినట్లు వివరించాడు. – కరీంనగర్‌రూరల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement