రేపు సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం
సామర్లకోట: సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం కాకినాడలో జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి జి.ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సమావేశంలో ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేస్తామన్నారు. కార్మికులకు ద్రోహం చేసేలా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండుతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విభజన తరువాత జిల్లా తలసరి ఆదాయం బాగా తగ్గిపోయిందని, జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి ఈశ్వరయ్యను అభినందించడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలదండలు, శాలువాలు, బొకేలు కాకుండా ఆర్థికంగా ఎంతో కొంత విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ విరాళాలు వచ్చే నెల 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ఎంతో ఉపయోగపడతాయని మధు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెదిరెడ్ల సత్యనారాయణ, బొత్సా శ్రీను, కశింకోట కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


