విలువను.. గుర్తించరా?
సాక్షి, అమలాపురం: ఇటు వ్యవసాయం.. ఇటు ఉద్యానం సాగు ఏదైనా, పంటలు ఏమైనా ఫలితం ఒక్కటే. దిగుబడులు పెరిగిన సమయంలో ధరలు ఉండవు. ధరలు ఉంటే దిగుబడి ఉండదు. ఈ రెండింటి మధ్య రైతు నష్టపోవడం పరిపాటిగా మారింది. రెండు నెలల క్రితం రికార్డు స్థాయి ధర వచ్చిన కొబ్బరి ఇప్పుడు నేల చూపు చూస్తోంది. అరటి ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ఉన్నా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పోక ధర బాగున్నా డిమాండ్‌కు తగినట్టుగా లేదు. ఇందుకు ప్రధాన కారణం దిగుబడులు పెరగడమే కాదు.. స్థానికంగా వినియోగం లేకపోవడం, దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సి రావడమే. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ధరలు రావాలంటే స్థానికంగా విలువ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ప్రభుత్వం, కోకోనట్ బోర్డు, క్వాయర్ బోర్డు, ఖాదీ, ఎంఎస్‌ఎంఈ, ఉద్యానశాఖ పరిశ్రమల ఏర్పాటు చేస్తామనే ప్రకటనలకు మాత్రమే పరిమితవుతున్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం భారీ పరిశ్రమలు తరలివస్తున్నాయని ప్రచారం చేసుకోవడమే తప్ప స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోవడం లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ముందుకు రాకపోవడంతో రైతుల నష్టాలు తీరడం లేదు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం లేదు.
వరితో ఇలా చేయొచ్చు
ఉమ్మడి జిల్లాలో వరి అతి పెద్ద సాగు. ఈ మూడు జిల్లాల్లో కలిపి 5.60 లక్షల ఎకరాల్లో రెండు పంటలు సాగవుతాయి. ఖరీఫ్, రబీ కలిపి 31.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. ధాన్యా న్ని నేరుగా విక్రయించి రైతులు, బియ్యం, తవుడు విక్రయాలతో మిల్లర్లు సరిపెడుతున్నారు. బియ్యాన్ని అన్నం కోసమే కాకుండా దీనితో నూడిల్స్, పాస్తా, పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్, రడీ టూ కుక్ రైస్, రైస్ మిల్క్ తయారు చేసే అవకాశముంది. సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు రైస్ బ్రాన్ కొవ్వు ఆమ్లాలతో సబ్బులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాలు తయారు చేయవచ్చు. రైస్ బ్రాన్ జ్యూస్, కొన్ని ఫుడ్ అప్లికేషన్స్ లేదా హెల్త్ డ్రింక్స్ తయారు చేయవచ్చు. తవుడుతో రైస్ రిచ్ ఆయిల్ వంటి వంట నూనెలతో పాటు టైర్లు, పెయింట్‌లు, సౌందర్య సాధనాలు, టూత్‌పేస్ట్, పశుగ్రాసం వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. కాకినాడ జిల్లా సర్పవరం వద్ద తవుడుతో ఆయిల్ తయారు చేసే పరిశ్రమలున్నాయి.
అరటి పౌడర్...
చిప్స్‌కు భలే డిమాండ్
అరటికి ప్రస్తుతం ధర లేక రైతులు విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో సుమారు 69 వేల ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. కేరళ, తమిళనాడుల్లో అరటి చిప్స్ తయారు చేస్తుంటారు. మన ప్రాంతాల్లో పొటాటో చిప్స్ స్థానంలో అరటి చిప్స్ ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే వీటి తయారీ పరిశ్రమలు స్థానికంగా లేవు. వీటితోపాటు అరటి పౌడర్, డ్రై బనానా, పానీయాలు, ఐస్ క్రీం, పెరుగును తయారు చేయవచ్చు. ఎండబెట్టిన అరటి పండును పిండిగా చేసి పూరి, చపాతీ తయారు చేసి అమ్ముతున్నారు.
ఉమ్మడి ‘తూర్పు’లో వరి,
కొబ్బరి, అరటి, కోకో విస్తృత సాగు
అన్ని రకాల ఉత్పత్తుల
ధరలు తగ్గి రైతులు విలవిల
దిగుబడి బాగున్న సమయంలో
ధరలు లేక నష్టం
విలువ ఆధారిత ఉత్పత్తులు
చేస్తే అదనపు ఆదాయం
అప్పుడే వ్యవసాయం,
ఉద్యానం లాభదాయకం
దీనిపై దృష్టి పెట్టని చంద్రబాబు సర్కార్
కోకో హోమ్‌మేడ్ చాక్లెట్
కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్‌లో అంతర పంటగా సుమారు 15 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కోకో బీన్స్‌ను నేరుగా అమ్ముతున్నారు. కానీ కోకో గింజలతో సొంతంగా ఇంటి వద్ద చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పాలు, డార్క్ చాక్లెట్‌లు, కోకో పౌడర్‌ను ఉత్పత్తి చేయవచ్చు. తమిళనాడులోని పర్యాటక ప్రాంతమైన ఊటీలో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని సొంతంగా చాక్లెట్ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఆ పరిస్థితి లేదు. కోకో గుజ్జుతో జామ్‌లు, జెల్లీలు, సౌందర్య పోషణ వస్తువులు కూడా తయారు చేయవచ్చు.
విలువను.. గుర్తించరా?
విలువను.. గుర్తించరా?
విలువను.. గుర్తించరా?


