‘బడిబాట’కు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

‘బడిబాట’కు వేళాయె..

Jun 6 2025 6:13 AM | Updated on Jun 6 2025 6:13 AM

‘బడిబాట’కు వేళాయె..

‘బడిబాట’కు వేళాయె..

జనగామ: అమ్మ ఆదర్శ పాఠశాలలతో కార్పొరేట్‌ కు ధీటుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన.. పిల్లల బంగారు భవిష్యత్‌కు బాట లు వేస్తున్న సర్కారు స్కూళ్లలో పిల్లలను చేర్పించా లంటూ టీచర్లు ఇంటింటా ప్రచారం చేయడానికి సన్నద్ధమయ్యారు. గత నెల చేపట్టిన ముందస్తు ‘బడిబాట’ ముగియగా.. నేటి(శుక్రవారం) నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. సర్కారు స్కూళ్లలో కల్పిస్తున్న వసతులపై ఈనెల 19వ తేదీ వరకు ఊరూరా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహ న కల్పించనున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యాబోధన గురించి కార్పొరేట్‌ తరహాలో ముద్రించిన కరపత్రాలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మొదటి విడత ‘బడిబాట’ కార్యక్రమంలో 132 మంది విద్యార్థులను గుర్తించి అడ్మిష న్ల కోసం తల్లిదండ్రులను సంప్రదిస్తున్నారు.

కార్యాచరణ మేరకు..

డీఈఓ భోజన్న ఆధ్వర్యాన నేటి నుంచి నిర్వహించ తలపెట్టిన రెండో విడత ‘బడిబాట’ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన కార్యాచరణ మేరకు ముందు వెళ్లనున్నారు. గ్రామ సభలు, బడిఈడు పిల్లల గుర్తింపు, ఇంటింటి ప్రచారం, అంగవాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్‌ఔట్‌ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం తదితర క్యాక్రమాలు చేపట్టాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రారంభం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ పంపిణీ, సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ, విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం, తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం, విద్యార్థులకు క్రీడా పోటీలతో ‘బడిబాట’ ముగియనుంది.

నేటి నుంచి రెండో విడత షురూ..

ఇంటింటి ప్రచారానికి ఉపాధ్యాయులు

19న క్రీడా దినోత్సవంతో ముగింపు

మొదటి విడతలో 132 మంది గుర్తింపు

‘బడిబాట’ కార్యక్రమాలు ఇలా..

6న : గ్రామసభలు

7న : ఇంటింటికీ వెళ్లి పిల్లల గుర్తింపు

8 నుంచి 10 వరకు : కరపత్రాలతో ఇంటింటి ప్రచారం. అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన. డ్రాప్‌ఔట్‌ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించ డం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించడం.

11న : 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష

12న: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యాన చేపట్టిన పనుల ప్రారంభం. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫాం పంపిణీ.

13న: సామూహిక అక్షరాభ్యాసం. బాలల సభ

16న: ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఐపీ దినోత్సవం

17న: విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం

18న: తరగతి గదుల డిజిటలీకరణపై అవగా హన. మొక్కల పెంపకం

19న: విద్యార్థులకు క్రీడా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement