వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్‌ దాడి

Viral Video: Amazon Driver Saves Customers Daughter and Pet From Pit Bull Attack - Sakshi

వాషింగ్టన్‌: సాధారణంగా కొందరు కుక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటికి తిండిపెట్టడం, స్నానం చేయించడం లాంటి పనులు చేస్తుంటారు. వాటిని ఎక్కడికి వెళ్లిన తమతో పాటు తీసుకెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని సార్లు యజమానులు తమ పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్తున్నప్పుడు వేరే కుక్కలు వాటిపై అరుస్తూ వెంట పడటం, దాడి చేయడం మనకు తెలిసిందే.

తాజాగా ఇలాంటి ఒక ఘటన యూఎస్‌లోని లాస్‌వేగాస్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 19 ఏళ్ల లారెన్‌ రే అనే యువతి తన పెంపుడు కుక్క మ్యాక్స్‌ను తీసుకొని ఇంటినుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఆమెకు ఒక షాకింగ్‌ ఘటన ఎదురైంది. ఒక  పిట్‌ బుల్‌ కుక్క ఆమె.. పెంపుడు కుక్కవైపు పరిగెత్తుకు వచ్చింది. అంతటితో ఆగకుండా మ్యాక్స్‌పై దాడిచేయడానికి ప్రయత్నించింది.

పాపం.. లారెన్‌.. ఎంత తప్పించాలని చూసిన ఆ శునకం మాత్రం దాన్ని కరవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అప్పుడు ఒక అమెజాన్‌ డ్రైవర్‌ యువతి అరుపులు విని వారి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత.. చాకచక్యంగా యువతిని తప్పించి ఇంటి లోపలికి పంపించి వేశాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిపోయి ఇంటి తలుపులు మూసేసింది. ఆ వీధి శునకం కూడా కాసేపటికి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయకరంగా దాడిచేస్తుంది..’,‘నీ తెలివికి హ్యట్సాఫ్‌..’, ‘పాపం.. చిన్న కుక్క దొరికితే దానిపని అంతే..’, ‘వదల బొమ్మాలి.. వదల అంటూ దాడి చేస్తోందంటూ’ కామెంట్‌లు పెడుతున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top