హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం

Hotel Employee made Woman Drink Semen Mixed With Water - Sakshi

అమెరికాకు చెందిన ఒక గమ్మత్తయిన వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్‌లో పనిచేసే ఓ ఉద్యోగి  అదే హోటల్‌లో బస చేసేందుకు వచ్చిన ఒక మహిళకు వీర్యం కలిపిన నీటిని ఇచ్చాడు. ఆమె ఆ నీటిని తాగినప్పుడు, ఆ రుచి కొత్తగా అనిపించింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది.  ఈ నేపధ్యంలో ఆమె ఆ హోటల్‌ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఆ నీటికి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా, అందులో వీర్యం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ, ఆమె భర్త సదరు హోటల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని  బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితునిపై తక్షణంచర్యలు చేపట్టి, హోటల్‌ యాజమాన్యం నుంచి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరుతోంది.

జేన్, జాన్ డో దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడానికి ఒక హోటల్‌కి వెళ్లారు. రిట్జ్-కార్ల్‌టన్ హోటల్‌లో తనకు ఫైవ్ స్టార్ హోటల్  తరహా స్వాగతం లభించిందని జేన్ తెలిపింది. అనంతరం హోటల్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఆమె వాటర్ బాటిల్ ఆర్డర్ చేసింది. దీంతో ఒక మగ ఉద్యోగి ఐదు వాటర్‌ బాటిళ్లను వారి గదిలోకి తెచ్చి, వారికి ఇచ్చి వెళ్లిపోయాడు. తరువాత వారంతా నిద్రపోయారు.

అర్ధరాత్రి దాహం వేయడంతో ఆమె ఆ బాటిల్‌లోని నీటిని తాగింది. అయితే ఈ నీటి రుచి కొత్తగా అనిపించడంతో ఆమె భర్తను నిద్ర నుంచి లేపి, విషయం చెప్పింది. దీంతో వారు ఈ విషయమై ముందుగా హోటల్ యాజమాన్యానికి, తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు ఆ హోటల్ ఉద్యోగి ఇ‍చ్చిన నీటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ఈ నీటిలో వీర్యం కలిసిందని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ మహిళ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ అకృత్యానికి పాల్పడిన హోటల్‌ ఉద్యోగిపై ఇంకా చర్యలు తీసుకోలేదని, అతనికి త్వరగా శిక్ష పడకపోతే ఇలాంటి పనులను కొనసాగిస్తాడని అన్నారు. 
ఇది కూడా చదవండి: కాలు జారిన మోడల్‌.. షూ కంపెనీదే తప్పంటోంది!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top