Hyderabad: ​​​​​​​నో పార్కింగ్‌.. అయితే ఏంటి? | - | Sakshi
Sakshi News home page

Hyderabad: ​​​​​​​నో పార్కింగ్‌.. అయితే ఏంటి?

May 4 2023 7:42 AM | Updated on May 4 2023 8:38 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: ప్రజావసరాలు, ప్రజాప్రతినిధుల కోసం, వారికి ఎస్కార్టుగా ఉండటం కోసం కేటాయించిన వాహనాలను కొంత మంది సిబ్బంది వారి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కుకు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఎస్కార్ట్‌ వాహనంలో డ్రైవర్‌, గన్‌మెన్లు నిత్యం వాకింగ్‌కు వస్తున్నారు. పార్కు వద్ద నో పార్కింగ్‌జోన్‌లో నిత్యం వాహనాన్ని నిలుపుతున్నారు.

ఇక్కడ వాహనాలు పార్కింగ్‌ చేయవద్దని వాకర్లు ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రిగారి వాహనం ఇది అంటూ దబాయిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సైతం ప్రశ్నించడంతో వారిని సైతం మీ ఉద్యోగాలు ఉండాలా పోవాలా అంటూ బెదిరించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement