ఉత్సాహం నింపేలా, విజయం పొందేలా!

N. Ramchander Rao Comment On Telangana BJP - Sakshi

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మూడ్రోజుల పాటు తెలంగాణలో జరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అత్యంత బలమైన క్యాడర్‌ ఉన్న తెలంగాణలో ఇవి జరగడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటికే పార్టీ అగ్ర నాయకత్వం జరిపిన పర్యటనలు తెలంగాణ ప్రజలలో బీజేపీపై ఎనలేని నమ్మకాన్ని పెంచాయి. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు పార్టీ బలాన్ని ఇదివరకే చాటాయి. రాబోయే కాలంలో తెలంగాణ లక్ష్యాలను, ఆశయాలను సాధించే విధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రానున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి ఇవి భూమికలా పనిచేస్తాయి.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 1, 2, 3 తేదీలలో తెలం గాణ రాష్ట్రంలో జరగడం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాలలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా, ప్రాంతీయ నాయకత్వానికి మనోధైర్యం ఇచ్చే విధంగా ఈ సమా వేశాలు జరుగుతున్నాయి.

దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రం తర్వాత అత్యంత బలమైన క్యాడర్‌ ఉన్న  ప్రాంతం ఏదంటే తెలంగాణ అని చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలుగు రాష్ట్రాల నాయకులు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. రాబోయే 2023 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు, దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలను గెల్చుకోవడం, వివిధ రాష్ట్రాలలో అధికారం  పొందే విధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు తోడ్పడతాయి. 

ఎన్నో ఆశలతో, లక్ష్యాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్‌ ఫ్యామిలీ చేతిలో అధికారం కేంద్రీకృతమై ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే లకూ, మంత్రులకూ వివిధ అంశాలపై స్పందించే  అధికారం లేక పోవడమే కాక, వారికి ప్రభుత్వంలోనూ, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లోనూ కనీస గౌరవం లేకుండా పోయింది. రాష్ట్రంలో యువకులకు గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్‌ లేవు. ఉద్యోగు లను ఉద్యోగుల్లా చూడకుండా వారిని ఎక్కడికి పడితే అక్కడికి బదిలీలు చేస్తున్నారు.

పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాజకీయం చేయడంతో రైతులు మానసిక క్షోభను అనుభ విస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు అందనీయకుండా నియంతృత్వ పాలన సాగుతోంది. దీనికి తగుబుద్ధి చెప్పే విధంగా, రాబోయే కాలంలో తెలంగాణ లక్ష్యాలనూ, ఆశయాలనూ సాధించే విధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

తెలంగాణలో బండి సంజయ్‌ మొదటి, రెండవ విడత పాద యాత్రలతో ప్రజలలోకి చొచ్చుకపోయిన భారతీయ జనతా పార్టీ, ప్రజల సమస్యలపై ఎలాంటి రాజీ లేకుండా పోరాడటంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. అలాగే గత రెండు మూడు నెలలుగా పార్టీ అగ్ర నాయకత్వం అమిత్‌ షా, జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన జాతీయ ముఖ్య నాయకుల పర్యటనలు తెలంగాణ ప్రజలలో బీజేపీపై ఎనలేని నమ్మకాన్ని పెంచాయి.

దుబ్బాక ఉప ఎన్నికలో విజయ ప్రస్థానాన్ని ప్రారంభిం చిన భారతీయ జనతా పార్టీ దానికి కొనసాగింపుగా గ్రేటర్‌ హైదరా బాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలలో 45పై చిలుకు కార్పొరేటర్‌ సీట్లు గెలిచి విజయదుందుభి మోగించింది. దీనితో నిరంకుశ పాలన నుండి తెలంగాణను విముక్తి చేయగలిగేది బీజేపీయే అన్న భావన ప్రజల్లోకి వెళ్లింది. అలాగే హుజురాబాద్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఉప ఎన్నికలో ధన బల ప్రలోభాలకు లొంగకుండా   ప్రజలం దరూ ముక్తకంఠంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. ఇదొక గొప్ప సంకేతం. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఎదుగుతున్నది. 

మునుపెన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశ ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు విస్తరిం చింది. భారతదేశం అంటే ఒక విశ్వ గురు అనీ, భారత్‌కు ఎలాంటి సాయం చేయడానికైనా మేము ఉన్నామనీ అభివృద్ధి చెందిన దేశాలు సైతం పొగడటం చూస్తే ప్రపంచంలో ఏ దేశానికీ లేని ప్రాముఖ్యత భారతదేశానికి ఉన్నదని మనకు తెలుస్తుంది. ఏ దేశానికైనా ఇలాంటి ఖ్యాతి ఎప్పుడు వస్తుంది అంటే సమర్థవంతమైన నాయకుడు ఉన్న ప్పుడే వస్తుంది. అది మోదీ ఘనతే అని మనం చెప్పుకోవచ్చు.

ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కరోనా కారణంగా చిన్నాభిన్నం అయిపోయాయి. అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత మొదలైన విపత్కర సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత సందర్భంలోనూ భారతదేశం నిలకడైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావం ప్రజలపై పడని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను సరైన పద్ధతితో ప్రభుత్వం నడుపుతోంది. మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014–15లో ఉన్న 45.15 బిలియన్‌ డాలర్ల నుండి, 2021–22 సంవత్సరానికి 83.57 బిలి యన్‌ డాలర్లకు చేరాయి. వస్తువుల ఎగుమతుల్లో 45 శాతం వృద్ధితో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలను సైతం వెనుకకు నెట్టి భారతీయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్‌ పెరిగే విధంగా  దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. బీజేపీకి ప్రజా శ్రేయస్సు పైన ఉన్న  నిష్ఠను ఇది తెలియజేస్తుంది.

ఈరోజు భారతదేశం రక్షణ పరంగానూ, విదేశాంగ విధానం లోనూ సుస్థిరమైన సుపరిపాలనతో ముందుకు వెళుతోంది. ఈశాన్య రాష్ట్రాలలో మనం గమనించినట్లయితే, తెగల మధ్య జరిగే మిలిటెంట్‌ పోరాటాల వల్ల , ఎప్పుడూ ప్రజా పరిపాలనకూ, ఆర్థిక వ్యవస్థకూ ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు సుస్థిరమైన పరిపాలన, దృఢమైన రక్షణ వ్యవస్థలతో ఈశాన్య ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈశాన్య ప్రాంత ప్రజలు ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ పెరిగింది. 

ఇదంతా ప్రధానమంత్రి రాజకీయ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆర్థిక అభివృద్ధిలోనే కాదు, సామాజిక న్యాయంలో కూడా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ అన్ని పార్టీల కంటే కూడా ముందుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటిస్తోంది.

ఒకసారి మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని, మరొకసారి దళిత వర్గానికి చెందిన వ్యక్తిని, ఇప్పుడు మహిళ, ఇంకా షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అనేది మాటలకంటే చేతలు గొప్పవని ఈ సందర్భంగా ఇతర పార్టీలకు తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా బలమైన సామాజిక వర్గాల నుండి డాక్టర్‌ లక్ష్మణ్‌ను ఎంపీగా రాజ్యసభకు పంపించడం, కిషన్‌ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకోవడంతో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించినట్టయింది. బీజేపీని అగ్ర వర్ణాలకు చెందినదని నిందిస్తూ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించే పార్టీలకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది. 

ఈరోజు దేశ ప్రజలందరికీ రాజకీయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీలాగా ఉండాలని ఒక ఆలోచన రావడం కూడా జరుగు తోంది.  దేశంలోని కొన్ని పార్టీలను గమనించినట్లయితే... కుటుంబ పాలన, బంధుప్రీతితో పాటు ధనార్జనే ధ్యేయంగా రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను మరచి పరిపాలన చేయడం చూస్తున్నాం. జూలై 1, 2, 3 తేదీలలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల నాయకులకు ఒక రకమైన విలువలతో కూడిన శిక్షణ ఇచ్చేలా ఉంటాయి. 

కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ, ముఖ్యంగా యువ కులు ఎవరైతే ప్రతిసారీ భారతీయ జనతా పార్టీ వెంబడి ఉన్నారో వారికి మనోధైర్యం కల్పించే విధంగా ఉంటాయి. అలాగే దక్షిణాది రాష్ట్రాలలో కుటుంబ పాలననూ, వారసత్వ రాజకీయాలనూ అంత మొందించే విధంగా ప్రజలలో ఉత్సాహాన్ని నింపేలా జరుగుతాయి. తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ డానికి అన్ని విధాలుగా అర్హత ఉన్న భారతీయ జనతా పార్టీ కార్య కర్తలకు కొండంత బలాన్ని ఈ సమావేశాలు ఇస్తాయి. బీజేపీ ఆధ్వ ర్యంలో నిర్మాణం కానున్న ప్రజాస్వామ్య తెలంగాణకు ఈ సమా వేశాలు పునాదిగా ఉంటాయి.

-ఎన్‌. రామచందర్‌ రావు, వ్యాసకర్త మాజీ ఎమ్మెల్సీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top