సమంత లగ్జరీ బ్రాండ్‌ వాచ్‌.. ధర ఎంతంటే..! | Samantha Ruth Prabhu Wores Rs 70 Lakh Bulgari Serpenti Watch | Sakshi
Sakshi News home page

సమంత లగ్జరీ బ్రాండ్‌ వాచ్‌.. ధర ఎంతంటే..!

Apr 19 2024 1:31 PM | Updated on Apr 19 2024 3:12 PM

Samantha Ruth Prabhu Wores Rs 70 Lakh Bulgari Serpenti Watch - Sakshi

టాలీవుడ్‌ నటి సమంత చక్కటి ఫ్యాషన్‌ దుస్తుల పోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి డ్రెస్‌ అత్యంత లగ్జరియస్‌ బ్రాండ్‌కు చెందినవే. ఈసారి మంచి కలర్‌ఫుల్‌ లుక్‌ ఫోటోలతో అభిమానులను ఆకర్షించింది. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందిన తెల్లటి లక్కర్‌ జాకెట్‌, స్కర్ట్‌ ధరించి.. క్యూట్‌ లూక్‌తో చూపురులన కట్టిపడేస్తుంది. దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ, ప్యాడెడ్‌ ఫోల్డర్‌లు, ఫుల్‌ స్లీవ్ల్‌లు బోర్డురూంలో సమావేశానికి వెళ్లే సీఈవోల మాదిరిగా ఉంది.

అందుకు తగ్గట్టు ఆమె ధరించి డైమండ్‌ స్టడెడ్‌ సెర్పెంటి స్పిగా వాచ్  ఆమె అందన్ని రెట్టింపు చేశాయి. ఆ వాచ్‌ డయల్‌ చ్టుటూ సిల్వర్‌ ఒపలైన్‌ , డైమండ్లతో పొదడబడి ఉంది. చేతికి స్పైరల్‌ బ్రాస్‌లెట్‌  మాదిరిగా ప్రకాశవంతంగా ఉంది. ఆ తెల్లటి దుస్తులకు సరిగ్గా సరిపోయింది కాంస్య మేకప్‌ సమంతాకి కొత్త లుక్‌ని ఇచ్చింది. బహుశా ఈ వాచ్‌ అంటే ఆమెకు చాలా ఇష్టమనుకుంటా దీన్ని మరో రెండు సందర్భల్లో కూడా ధరించింది. ఒకసారి బోల్డ్‌ బ్లాక్‌ దుస్తులను ధరించినప్పుడూ వాచ్‌ మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అలాగే ఓ ఫ్రైమ్‌ వీడియో ఈవెంట్‌కు కూడా ఈ సర్పెంటీ వాచ్‌ని ధరించారు.

అలాగే ఈ వజ్రాలతో కూడిన వాచ్‌కి కేవలం సమంతా మాత్రమే ఫ్యాన్‌ కాదు మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీకి కూడా తెగ ఇష్టం. అందుకే కియారా కాఫీ విత్‌ కరణ్‌ జోహార్‌ షోలో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి, చేతికి వెండి సర్పెంటీ స్పిగా వాచ్‌ను ధరించింది. మంచి జీవనశైలితో జీవితాన్ని ఆశ్వాదించేవారికి ఈ బల్గారియా వాచ్‌లు స్టైయిల్‌ష్‌ లుక్‌ని ఇస్తాయట. ఇంతకీ డైమండ్‌లతో పొదగబడిన ఈ వాచ్‌ ధర వింటే షాకవ్వుతారు. ఈ బల్గారియా సర్పెంటీ వాచ్‌ ధర ఏకంగా రూ. 70 లక్షలట. లగ్జరీ బ్రాండ్‌కి తగ్గ రేంజ్‌ ధర కాబోలు..!

(చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!)

Advertisement
 
Advertisement
Advertisement