
ఉత్కంఠగా సీనియర్ ఓపెన్ చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన సీనియర్ ఓపెన్ చెస్ జిల్లా స్థాయి పోటీలు ఉత్కంఠగా జరిగాయి. ఈ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. ద్రాక్షారామ సాత్విక్ (ప్రథమ), తాడి వెంకటేష్ (ద్వితీయ), బండారు నానిబాబు (తృతీయ), పి.ధరణి (4వ స్థానం) సాధించారని చెప్పారు. ఈ నలుగురు విజేతలు ఈనెల 6వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిధి స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి బహుమతులు అందజేశారు.