
పట్టుదలతో నేర్చుకున్నా
క్రీడల్లో మంచి ప్రతిభ చూపి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉండేది. ఏ ఆటలో నాకు మంచి జరుగుతుందనేది అర్థమయ్యేది కాదు. కాని పిఠాపురంలో బాక్సింగ్ క్రీడలో శిక్షణ ఇస్తున్న కోచ్ లక్ష్మణరావు వద్దకు వెళ్లి మాట్లాడగా నీవు బాక్సింగ్ బాగా ఆడగలుగుతావు అంటు ప్రోత్సాహించారు. ముందు కొంత భయమేసింది ఇంట్లో వాళ్లు బాక్సింగ్ అంటే చాలా ధైర్యం ఉండాలి.. జాగ్రత్త అన్నారు. కాని మా కోచ్ చాలా ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో బాక్సింగ్ నేర్చుకున్నా. పిఠాపురంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించాను. విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాను. జాతీయ స్థాయిలో మంచి పతకాలు సాధించడమే ధ్యేయం.
– అడబాల వైష్ణవి, బాక్సింగ్ క్రీడాకారిణి, మల్లాం, పిఠాపురం మండలం