
తొలిదశలో గుర్తిస్తే బోన్ క్యాన్సర్ నివారణ
● అమోర్ ఆసుపత్రి ఎండీ, బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిశోర్‌రెడ్డి ● ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్లపై పీఎంపీలకు అవగాహన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బోన్ క్యాన్సర్ వచ్చిందంటే ఇక చివరిదశే అని చాలామంది అనుకుంటారు. అది పూర్తి అపోహేనని హైదరాబాద్‌కు చెందిన అమోర్ ఆస్పత్రి ఎండీ, బోన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కిశోర్‌రెడ్డి తెలిపారు. స్థానిక మోడల్‌కాలనీలో ఉన్న ఎఫ్ కెఫే హోటల్‌లోని ఫంక్షన్ హాలులో ఆదివారం ఉభయగోదావరి జిల్లాల్లోని పీఎంపీ వైద్యులకు ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ కిశోర్‌రెడ్డి ఆదివారం అవగాహన కల్పించారు. కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎముకలకు కండరాలకు సంబంధించిన క్యాన్సర్‌కు కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలను వివరించారు. క్యాన్సర్లు వ్యక్తి జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ముఖ్యంగా బోన్ క్యాన్సర్లపై అవగాహన అవసరమన్నారు. బోన్ క్యాన్సర్‌కు గురైన ఎందరికో నేటి ఆధునిక వైద్యంతో నయం చేశామన్నారు. మూడేళ్ల చిన్నారికి సైతం బోన్ క్యాన్సర్ చికిత్స చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుమళ్ల రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కోన చిన్నారావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్ ప్రసాద్, ఎండీ తానీషా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు రహమాన్ ఖాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎ.ధనుంజయ్, కార్యదర్శి మట్టా రమేష్‌లతో పాటు అన్ని మండలాల నాయకులు హాజరయ్యారు.